25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా..

విజయశాంతి ని ఘనంగా సన్మానించిన...

బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

తరలివచ్చిన బిజెపి అగ్రనేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

తెలంగాణలో 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా సినీనటి బిజెపి నాయకురాలు విజయశాంతిని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ఘనంగా సన్మానించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి బిజెపి పార్టీ అగ్రనేతలు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో, మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి మన రాములమ్మ, విజయశాంతి అని ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వక్తలు కొనియాడారు.  "బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి లతో కలిసి విజయశాంతికి" విజయ ఖడ్గాన్ని రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ బహుకరించారు.


అనంతరం విజయశాంతిని ఆయన శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర పదాధికారుల, రంగారెడ్డి జిల్లా ఓబీసీ బిజెపి ఓబీసీ మోర్చ కార్యదర్శి నాన్నవాళ్ళ కుమార్ యాదవ్, రాష్ట్ర ఓబీసీ మోర్చ కార్యనిర్వాహాక సభ్యులు బుక్క క్రిష్ణ, శంషాబాద్ మండల బీజేవైఎం అధ్యక్షులు బుక్క ప్రవీణ్, రాంనగర్ కార్పొరేటర్ రవి చారీ, శంషాబాద్ మండల ఓబీసీ అద్యక్షులు మల్చాలం మోహన్ రావు, మరియు రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: