2023

కోలేటి దామోదర్ గుప్తా జన్మదిన సందర్భంగా

 హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున అన్నధాన కార్యక్రమం

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్  కోలేటి దామోదర్ గుప్తా జన్మదిన సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున లాల్ దర్వాజా చౌరస్తాలో సుమారు 600 మంది కి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జమ్మిచెట్టు రాజు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్త, కోశాధికారి లింగా ప్రకాష్ గుప్త, ఐపీపీ  మ్యాడం దయాకర్ గుప్త, చింతలఘట్ శ్రీరామ్, కొక్కళ్ల సత్యం గుప్త,  కూన వెంకట గోపాల కృష్ణ, సరబు విశ్వేశ్వర గుప్తా, శ్రీరామ్ కోటయ్య, శ్రీధర మల్లికార్జున్ సరబు సంతోష్ కుమార్, కె. శ్రవణ్ కుమార్, శేఖర్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.




 కేసీఆర్ ప్రత్యేక విజన్ తో నిరంతర విద్యుత్

విద్యుత్  లేక నాడు  పరిశ్రమల మూత

నేడు  రాష్ట్రానికి పెట్టుబడుల వరద

విద్యుత్ కోసం 2500 కోట్లు రంగారెడ్డిలో ఖర్చేచేశాం

మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కందుకూరులో జరిగిన  విద్యుత్ ప్రగతి  సభలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. 2014 కు ముందు రైతన్నలు కరెంట్ కోసం పడిగాపులు కాసే వారని, వచ్చే విద్యుత్ కూడా రాత్రి వేల ఇస్తుంటే రైతులు ఇబ్బందులు పడే వారని,  పగలు ఇవ్వాలని డిమాండ్ చేసే వారని నేడు వెలుగులు చిమ్ముతూ 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. నాడు విద్యుత్ రాక కంపెనీలు మూతపడి,  కార్మికులు రోడ్డున పడేవారని నేడు కంపెనీలకు నిరంతరాయ విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం వస్తే చిమ్మ చీకటి అవుతుందన్నారని కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఒక విజన్ తో ముందుకెళ్తూ.24 గంటల విద్యుత్ వ్యవసాయానికి, పరిశ్రమలకు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  విద్యుత్ కోసం 2500 కోట్లు రంగారెడ్డిలో ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు..


పొలాల్లో ట్రాన్సఫార్మర్ కాలిపోతే రైతులే చందాలు వేసుకొని లారీలో మరమ్మతులకు తీసుకెళ్లేవారని కానీ నేడు విద్యుత్ సమస్యలు రాకుండా హై ఓల్టేజ్, లో ఓల్టేజ్ సమస్యలు లేకుండా, నూతన సబ్ స్టేషన్లు, ట్రాన్సఫార్మర్లు,  స్తంభాలు, తీగలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  వీటి కోసం రాష్ట్రంలో 32 వేల కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు.  24 గంటల ఉచిత విద్యుత్  కోసం విద్యుత్ సంస్థలకు 10 వేల500 కోట్ల సబ్సిడీ రైతుల తరుపున ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. గతంలో కరెంట్ 1200  యూనిట్లు వినియోగిస్తుంటే నేడు అది 2126 యూనిట్లుగా ఉందన్నారు. కేసీఆర్ ఓ ప్రత్యేకమైన  విజన్ పరిపాలనతో నేడు 24 గంటల విద్యుత్ సాద్యం అయిందని అంతేకాక పరిశ్రమలకు నీరు, రోడ్లు లాంటి కనీస సౌకర్యాలుకల్పించటంతో పాటు శాంతిభద్రతలు బాగుండటంతో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు.


పెద్ద పెద్ద కంపెనీలు, ప్రపంచ స్థాయి  ఇన్వెస్టర్లు రాష్టానికి వస్తున్నారన్నారు.  ఎస్ సి లు 6 లక్షల మందికి,ఎస్టీలకు 3 లక్షల మందికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. నాయి బ్రాహ్మణులకు సెలూన్లలో 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు,రజకులకు లాండ్రీ,ఇస్త్రీ కోసం 250 యూనిట్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో వివిద లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి ,స్థానిక ప్రజాప్రతినిధుల సహాయంతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

శివ పార్వతుల విగ్రహ ప్రతిష్టపన ,కళ్యాణంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి


కందుకూరు మండలం రాచులూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ శివ రామ చంద్రస్వామి దేవాలయములో శివ పార్వతుల విగ్రహ ప్రతిష్టపన ,కళ్యాణంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. 



 ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వాగతం పలికిన,,,

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘన స్వాగతం పలికారు. చంఢీయాగం,వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య సోమవారం ఉదయం ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె.కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు, రంజిత్ రెడ్డి,  పసునూరి దయాకర్, కే.ఆర్.సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, పీ.రాములు తో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. 


కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, భానుప్రకాష్ రావు , దండె విఠల్,  జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వీ.ప్రకాష్, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్,  శుభప్రద పటేల్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ.  యువ నాయకులు కార్తీక్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఆంజనేయులు గౌడ్, శ్రీధర్ రెడ్డి,  గెల్లు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.  15 అంతస్థులతో నిర్మించనున్న ఈ భవనంలో అతిపెద్ద డిజిటల్ లైబ్రరీ,  శిక్షణ, పరిశోధన కేంద్రం,  అతిథుల కోసం విశ్రాంతి గదులు, క్యాంటీన్ ఉండనున్నట్లు తెలిసింది.

 ప్రజాభిప్రాయానుగుణంగా పనిచేసే నాయకత్వం దేశానికి అవసరం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

కోకాపేటలో ‘భారత్ భవన్’కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇతర నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ప్రజలచేత ఎన్నుకోబడిన  ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. భావి భారత నిర్మాతలుగా  రేపటి యువతను తయారు చేసే దిశగా, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరమున్నదన్నారు. ఇందుకోసం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సైద్దాంతిక  రంగాల్లో భోధన, శిక్షణ అవసరమున్నదని సిఎం కేసీఆర్ అన్నారు. ఈ దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా, సోమవారం నాడు కోకాపేటలో ‘భారత్ భవన్’ (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్) కు బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ శంఖుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ... ‘‘ దేశ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వర్తమాన భారతానికి అవసరమున్నది. సమాజాభివృద్ధికి దోహదం చేసే దిశగా నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనమీద వున్నది.ఈ దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాల్లో అనుభవజ్జులైన గొప్ప గొప్ప మేధావులను, నోబుల్ లారేట్లను కూడా పిలిచి నాయకత్వ శిక్షణనిప్పిస్తాం. ప్రజలకు సుపరిపాలన నందించే నాయకత్వాన్ని తీర్చిదిద్దుతాం. తద్వారా భారత ప్రజాస్వామిక సౌధాన్ని మరింత పటిష్టం చేసే కృషి చేస్తాం. అందులో భాగంగానే ‘ పొలిటికల్ ఎక్సలెన్స్ అండ్ హెచ్ ఆర్ డీ’ కేంద్రాన్ని తీర్చిదిద్దాలనే నిర్ణయం తీసుకున్నాం.’’ అని సిఎం కేసీఆర్ తెలిపారు. 


రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో శిక్షణనిచ్చేందుకు దేశం నలు మూలలనుంచి అనుభవజ్జులైన రాజనీతి శాస్త్రజ్జులు, ఆర్థిక వేత్తలు సామాజిక వేత్తలు సమాజాభివృద్ధికి దోహదం చేసే రచయితలు  ప్రొఫెసర్లు విశ్రాంత అధికారులు తదితరులను ఆహ్వానించనున్నట్టు సిఎం తెలిపారు. దేశం నలుమూలలనుంచి వచ్చే సామాజిక కార్యకర్తలకు రాజకీయ వేత్తలకు నాయకులకు భారత్ భవన్ లో  సమగ్రమైన సమస్త సమాచారం లభ్యమౌతుందని సిఎం అన్నారు.


ఇక్కడికి  శిక్షణ కోసం వచ్చే వారికోసం, శిక్షణ పొందే వారి కోసం  వసతులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.  శిక్షణకు అనుగుణంగా.. తరగతి గదులు, ప్రొజెక్టర్ తో కూడిన మినిహాల్స్, విశాలమైన సమావేశ మందిరాలు, అత్యాధునిక సాంకేతికత కలిగిన డిజిటల్ లైబ్రరీలు, వసతికోసం లగ్జరీ గదులు నిర్మితమౌతాయని సిఎం అన్నారు. దేశ విదేశాల వార్తా పత్రికలు అందుబాటులో వుంటాయని తెలిపారు. ప్రపంచ రాజకీయ సామాజిక తాత్విక  రంగాలకు చెందిన  ప్రపంచ మేధావుల రచనలు, గ్రంధాలు అందుబాటులో వుంటాయన్నారు. స్థానిక, దేశీయ, అంతర్జాతీయ మీడియా ఛానల్లు సమాచార కేంద్రాలుండే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా...సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో చోటు చేసుకునే పురోగతిని పరిశీలించే వేదికలను అందుబాటులోకి తెస్తామన్నారు. వార్తలు  కథనాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ విశ్లేషించి, క్రోడీకరించే వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నామని అధినేత తెలిపారు. 

ప్రజలను నిత్యం ప్రభావితం చేస్తున్న సామాజిక మాధ్యమాల పట్ల అవగాహన కోసం ప్రత్యేక శిక్షణాతరగతులుంటాయని అన్నారు. మీడియా రంగంలో రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికను అందిపుచ్చుకునే దిశగా సీనియర్ టెక్నికల్  బృందాలు కూడా పనిచేస్తాయని తెలిపారు. సంక్షేమం అభివృద్ధి రంగాల అధ్యయనం దిశగా, శిక్షణ సమాచారం అందుబాటులో వుంటుందన్నారు. 

భారత్ భవన్ కు కేటాయించిన స్థలంలోని కొంతమేరకే భవన నిర్మాణం చేపడుతామని, మిగిలిన స్థలమంతా పచ్చదనంతో  నింపుతామన్నారు. నాయకత్వ శిక్షణ కోసం ఇక్కడకు వచ్చే వారికి  విశాల ప్రాంతంలో ఆహ్లాదకరవాతావరణం లో శిక్షణ బోధన అందుతుందని సిఎం తెలిపారు.

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ ... నిర్మాణ స్థలమంతా కలియ తిరిగారు. నాలుగు మూలలా సరిహద్దుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతర్గత రోడ్లు నిర్మాణం గురించి చర్చించారు. భవన నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన చర్యలగురించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజకు, అధికారులకు సిఎం పలు సూచనలు చేసారు.

భూ వరాహ హోమం :

 ఈ సందర్భంగా జరిగిన శంఖుస్థాప కార్యక్రమంలో సిఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేద మంత్రోశ్చారణల నడుమ వేద పండితులు నిర్వహించిన భూ వరాహ హోమం కార్యంలో సిఎం పాల్గొన్నారు. అనంతరం నిర్దేషిత సమయానికి భవన నిర్మాణానికి శంఖుస్థాపన బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ చేతులమీదుగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెంట మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, బిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బిబి పాటిల్, రంజిత్ రెడ్డి, దామోదర్ రావు, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి, కవిత, శేరి సుభాష్ రెడ్డి,శంభీపూర్ రాజు, వెంకట్రామిరెడ్డి,మహేందర్ రెడ్డి, గోరెటి వెంకన్న, ఎగ్గె మల్లేశం,ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, దానం నాగేందర్, కాలె యాదయ్య, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, రవీందర్ సింగ్, రాజీవ్ సాగర్, సతీష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, కార్తీక్ రెడ్డి, సాయిచంద్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, అనిల్ కూర్మాచలం, సోమ భరత్, జడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి, గ్యాదరి బాలమల్లు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటి కేసీఆర్


ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కను నాటారు. అనంతరం నాటిన మొక్కకు ఆక్ష్న నీరుపోశారు. ఈ కార్యక్రమంలో  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


 కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఎంతో మారింది

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్  న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎల్ బి నగర్ లో జరిగిన  సురక్ష దినోత్సవంలో  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రాచకొండ సీపీ చౌహన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మూసి రివర్ బోర్డు చైర్మన్ సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయనంద్, డీసీపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో భారీ ఎత్తున తెలంగాణ దశాబ్ది  ఉత్సవాలు. నిర్వహిస్తున్నట్లు, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2014 కు ముందు ఎట్లుండే తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో  ఇపుడు ఎట్లా మారిందో ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. దేశం మొత్తం లో నంబర్ వన్ గా తెలంగాణ పోలీస్ నిలుస్తుందన్నారు.

స్వరాష్ట్రంలో నూతనంగా పోలీస్ స్టేషన్లు, ఏసీపీ, డీసీపీ జోన్లు, కమిషనరేట్లు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత దగ్గరగా ఫ్రెండ్లి పోలీస్ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. పై స్థాయిలో సీపీ నుండి మొదలుకొని హోం గార్డు వరకు నేడు ర్యాలీలో పాల్గొని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారని అన్నారు. తాళం వేయనిది ఒక పోలీస్ స్టేషన్ మాత్రమేనని,రాత్రింబవళ్లు ప్రజల కోసం పనిచేస్తూ అందరూ ప్రశాంతంగా నిద్రపోయేలా పోలిసులు పనిచేస్తున్నారని అన్నారు.


శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అని తద్వారా రాష్టానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారని, నూతన ఉద్యోగాలతో పాటు,అధునాతన వాహనాలు సమకూర్చారన్నారు. అభివృద్ధి కి అంకితం అవుదాం...తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో బాగస్వాములు అవుదాం అని మంత్రి పిలుపునిచ్చారు. 

 



ఇదిలావుంటే త్రివర్ణ రంగుల బెలూన్లను గాలిలో ఎగురవేసి భారీ పోలీస్ ర్యాలీని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.  మీ కోసం మేమున్నాం అంటూ సైరన్ల మోత మోగిస్తూ కదం తొక్కిన పోలీస్ దళాలు...త్రివర్ణ పతకాలు చేత బట్టి పోలీసులకు సంఘీభావం తెల్పిన యువత, స్థానిక ప్రజలు. మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెల గూడలోని శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ,శ్రీశ్రీ మల్లికార్జున స్వామి వార్ల వార్షికోత్సవం లో పాల్గొని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


















 


  ఆర్ కె పురం డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు

శంకుస్థాపన చేసిన  మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్  న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం ఆర్ కె పురం డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. ఎన్ టిఆర్ నగర్ విష్ణుమూర్తి లైన్ లో 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించే స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు, జనప్రియ గార్డెన్ కమ్యూనిటీ హాల్ లో 22 లక్షల 65 వేల రూపాయలతో చేపట్టిన పనుల ప్రారంభోత్సవం చేశారు, సరోజిని పార్క్ లో సీసీ కెమెరాలను ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.....ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతంలో నూతనంగా వచ్చిన ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, లింక్ రోడ్లతో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందన్నారు. నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.