మహిళలు ఆర్థికంగా నిలుదొక్కుకొనేందుకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందిస్తుంది

మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మీర్ ఖాన్ పేట్ నుండి బేకరికంచ వరకు 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న బీటీ  రోడ్డు పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు  అనంతరం కందుకూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు  కుట్టుమిషన్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళలు టైలరింగ్ తో  స్వయం ఉపాధి పొందటానికి మంచి అవకాశం లభిస్తుందన్నారు.స్వయం సహాయక సంఘాల మహిళలు చిరు వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా బలపడటానికి ప్రభుత్వం రుణాలు ఇస్తుందన్నారు.ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు ప్రధానం చేసారు.









Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: