ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా...

మెగా బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసిన నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నంద్యాల శాసనసభ సభ్యులు రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు వై ఎస్ ఆర్ సి పి నాయకులు టేక్కే మార్కెట్ యార్డ్ నందు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్  ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంకు విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలోనీ ప్రజలకు అత్యవసర ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం అందుబాటులో లేక చాలామంది ప్రజలు మరణించారని అందువల్లనే రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా మరణించరాదనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన పురస్కరించుకొని బ్లడ్ బ్యాంకు ను ఏర్పాటు చేశామని,


ఈ కార్యక్రమంలో యువతి యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొ.నడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపి,బ్లడ్ బ్యాంకుకు విచ్చేసిన స్వచ్ఛంద రక్తదాతలచే రక్తదాన ప్రతిజ్ఞ చేయించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం క్రీడలలో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పి పి మధుసూదన్ రెడ్డి ,మున్సిపల్ చైర్ పర్సన్ మా బున్నీసా,బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్ ,ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి ,నంద్యాల మండలం జడ్పిటిసి గోకుల్ కృష్ణారెడ్డి, నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్,మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్లు రవి కృష్ణ , రాకేష్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు,జిల్లా రెడ్ క్రాస్ పర్ల దస్తగిరి, వైయస్సార్సీపీ నాయకులు,నంద్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు,వార్డు ఇన్చార్జిలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: