తెలంగాణ రాష్ట్ర పాలన దేశం కోరుకుంటుంది
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
బిఆర్ఎస్ పార్టీ భారత దేశ రాజకీయాల్లో ఒక నూతన శకానికి నాంది పలుకుతుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజల కోసం ముఖ్యంగా రైతాంగం కోసం బిఆర్ఎస్ తో దేశ రాజకీయాల్లో వెళ్ళటం శుభ పరిణామామం అన్నారు.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు దేశ వ్యాప్తంగా ప్రజల నుండి డిమాండ్ వస్తుందని,ఇలాంటి పాలన బిఆర్ఎస్ తో సాధ్యమని అన్నారు.అబ్ కి బార్ కిసాన్ కి సర్కార్ నినాదంతో ముందుకు వెళ్తున్న కేసీఆర్ కి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తుందని అన్నారు.ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీకి పయనమైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. ఇదిలావుంటే మంగళవారంనాడు సాయత్రం బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది.
Home
Unlabelled
తెలంగాణ రాష్ట్ర పాలన దేశం కోరుకుంటుంది,,, మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: