సక్షమ్ సంస్థ దివ్యాంగుల కోసం పనిచేస్తున్న...

అఖిల భారతీయ సేవా సంస్థ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోనీ బిలకల గూడూరు గ్రామంలో సక్షమ్ అఖిల భారతీయ సేవ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి దాదాపు 30 మంది దివ్యాంగులు హాజరయ్యారు.విద్యా, వైద్యం,ఉపాధి మరియు ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తూ,దాతలసహకారంతో దివ్యాంగులకు కావలసిన అవసరాలను తీర్చుకోవడం మరియు ధనమే ప్రధానం కాకుండా చేసే సేవా కార్యక్రమాల గురించి దివ్యాంగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో కొంతమందిదివ్యాంగులు తమకు బస్ పాస్ లేదని సక్షమ్ అఖిల భారతీయ సేవా సంస్థ వారి దృష్టికి తీసుకురాగా బస్సు పాస్ లేని వారికి త్వరలోనే బస్ పాసులు మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో.సక్షమ్ అఖిల భారతీయ సేవా సంస్థ జిల్లా జాయింట్ సెక్రెటరీ సుబ్బారావు,గడిగరేవుల,  బిలకలగూడూరు గ్రామకార్యకర్తలు రంగస్వామి,అబ్దుల్ కలాం మరియు దివ్యాంగులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: