గని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో,,,
గణిత ప్రదర్శనశాల నిర్వాహణ
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులు మహబూబ్ బాషా, రామాంజనేయులు ఆద్వర్యంలో గణిత ప్రదర్శనశాలను నిర్వహించారు. గణిత శాస్త్ర మేధావి అయిన శ్రీనివాస రామానుజం చిత్ర పటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భగా పాఠశాల ప్రధనోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రామానుజన్ 1887 డిసెంబర్ 22వ తేదీన శ్రీనివాస అయ్యంగార్ కోయిలయంగా మద్రాస్ రాష్ట్రం (తమిళనాడు)లో జన్మించారని చిన్న వయసులోనే గణిత శాస్త్రం లో పరిశోధనలు చేసి ఆధునిక గణితశాస్త్ర పితామహుడుగా నిలిచారనితెలిపారు.
అనంతరం పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు గణిత శాస్త్రంలో చేసిన నమూనా ప్రదర్శనశాలను ప్రారంభించారు. గణిత శాస్త్ర ప్రదర్శనశాలను పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, గ్రామ ప్రజలు గణిత ప్రదర్శనశాలలో ప్రదర్శించిన వివిధ రకాల నమూనాలను తిలకించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుకన్య, శేశమరాజు, రాములు, ప్రకాష్ రెడ్డి, సోమన్న, రవీంద్ర, పుల్లయ్య, ఇమాంవలి, ప్రతాప్ రెడ్డి, వివేక్, సుబ్బారాయుడు, పుష్ప లత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Home
Unlabelled
గని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో,,, గణిత ప్రదర్శనశాల నిర్వాహణ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: