ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
బహుజన సమాజ్ పార్టీ డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ సోమశేఖర్ ను కలసి బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూరు నియోజకవర్గం అసెంబ్లీ ఇంచార్జ్ ఎల్ స్వాములు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కలలు నెరవేర్చాలనే మంచి ఉద్దేశంతో జగనన్న కాలనీలను రాష్ట్రవ్యాప్తంగా నిర్మించడం జరుగుతోందని, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇళ్ల నిర్మాణం కోసం ఒక ఇటుక గాని,ఒక రాయి గాని పేర్చలేదని,ఊరికి దూరంగా జగనన్న కాలనీ ఉండడంవల్ల అక్కడికి లబ్ధిదారులు వెళతారో లేదో తెలియదు గాని ఇప్పటికే పాములపాడు మండల ఆర్డబ్ల్యూఎస్ అధికారులు 4 లక్షల 90 వేల రూపాయల నిధులను మంజూరు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని,బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ద్వారా ఆందోళన కార్యక్రమాలు చేసిన ఇంతవరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఎలాంటి చర్యలు మండలంలో పనిచేయుచున్న ప్రభుత్వ ఆధికారులు తీసుకోవడం లేదని, ఇప్పటికైనా నంద్యాల జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పాములపాడు మండలంలోని మిట్టకందాల గ్రామంలోని జగనన్న కాలనీ నీ సందర్శించి విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Home
Unlabelled
ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి,,,,, బహుజన సమాజ్ పార్టీ డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: