పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా
ఘన నివాళులర్పించిన..పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
"అమరజీవి" శ్రీపొట్టిశ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మాధవి నగర్ లోని స్వగృహంలో చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన పాణ్యo నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యురాలు,టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గురవయ్య,మహాలక్ష్మిమ్మ లకు 16 మార్చి 1901 లో పడమటి పల్లె,నెల్లూరు జిల్లాలో జన్మించారని, తెలుగు భాష మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని 56 రోజులపాటు నిరాహార దీక్ష చేసి 15 డిసెంబర్ 1952 లో చెన్నై తమిళనాడు రాష్ట్రంలో మరణించారని,
ఆయన మరణానంతరం తెలుగు భాష మాట్లాడే ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అందువల్లనే పొట్టి శ్రీరాములు గారిని "అమరజీవి"అని పిలుస్తారని తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్,నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంగాధర్ గౌడ్,నన్నురు గ్రామ నాయకులు విశ్వేశ్వర రెడ్డి,ఖాజామియా, విజయుడు,వడ్లబాషా, విజయ్ యాదవ్,యశ్వంత్ రెడ్డి,రవి ప్రకాష్ రెడ్డి, దొడ్డిపాడు బాషా,తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ,,, ఘన నివాళులర్పించిన..పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: