వికలాంగుల, వృద్ధుల ఆశ్రమానికి ఫ్యాన్లు వితరణ

జమాఅతె ఇస్లామీహింద్ ఉమెన్స్ వింగ్ చేయూత

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

బాల్యం... వృద్ధాప్యం... ఈ రెండు దశలూ బలహీనమైనవి. పాలబుగ్గల పసిప్రాయంలో అమ్మ వెచ్చని కౌగిలి.. నాన్న ప్రేమ ఎంతో అవసరముంటుంది. అలాగే మలి వయసులోనూ తల్లిదండ్రులకు కన్న పిల్లల ఆసరా లేకపోతే అలాంటి జీవితం నరకప్రాయమే అవుతుంది. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో అలాగే పిల్లల ఆదరణకు నోచుకోని పేరెంట్స్ జీవితాలూ మోడువారిపోతాయి. అలాంటి అనాథ, వికలాంగ పిల్లలకు, వృద్ధులకూ మేమున్నామని ఆసరా కల్పిస్తే వారి జీవితాలకు ఎంతటి ఉపశమనమో కదూ! టోలీచౌకీలోని అనురాగ్ హ్యూమన్ సర్వీసెస్ సెంటర్ ఎంతోమంది శారీరక, మానసిక అంగవైకల్యమున్న పిల్లలకూ, సీనియర్ సిటిజెన్లకూ అమ్మలా ఆసరా కల్పిస్తోంది.


అనురాగ్ హ్యూమన్ సర్వీసెస్ సేవల్ని జమాఅతె ఇస్లామీహింద్ ఉమెన్స్ వింగ్ నాయకులు నాసిరా ఖానమ్, ఆయిషా సుల్తానా, నసీమ్ సుల్తానా ఎంతగానో మెచ్చుకున్నారు. సెంటర్లో సేదతీరుతున్న వికలాంగ పిల్లలను అమ్మలా చేరదీసి వాళ్ల తల నిమిరి చల్లని దీవెనెలు అందించారు. వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడారు. గురువారం అనురాగ్ హ్యూమన్ సర్వీసెస్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్బంగా సెంటర్ కు కావాల్సిన సీలింగ్ ఫ్యాన్లను విరాళంగా అందించారు. వృద్ధులు, పిల్లలకు పండ్లు ఫలహారాలు అందించారు. ఈ సందర్భంగా ఆయిషా సుల్తానా మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: