ఎటకేలకు గడివేముల జడ్.పి.హెచ్.ఎస్ ఆట స్థలానికి.. 

వీడిన గ్రహణం

(జానో జాగోో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా మండల పరిధిలోని స్థానిక జడ్పీహెచ్ఎస్ ఆట స్థలంకు ఎట్టకేలకు గ్రహణం వీడింది.వివరాల్లోకి వెళ్తే గతంలో జెడ్పిహెచ్ఎస్ ఆటో స్థలంలో గుంతలు ఏర్పడి,గడ్డి ఏపుగా పెరగడంతో గడ్డిని తినేందుకు వచ్చిన పశువుల వల్ల ఆట స్థలంలో గుంతలు గుంతలుగా ఏర్పడి నడవడానికి కూడా వీలు లేకుండా పూర్తిగా దెబ్బ తిన్న ఆట స్థలమును గడివేముల జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మరియు పిఈటి రవికుమార్ ల


చొరవతో జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ వారు వారి సొంత ఖర్చులతో విద్యార్థినీ, విద్యార్థులు మానసికంగా,శారీరకంగా దృఢంగా విద్యార్థిని,విద్యార్థులు అందరూ ఉండాలనే సంకల్పంతో ఆటలు ఆడుకోవడానికి కూడా వీలు లేకుండా ఉన్న ఆట స్థలమును పూర్తిగా చదును చేశారు.విద్యార్థిని, విద్యార్థులు అందరూ ఆటలు ఆడుకోవడానికి ఆట స్థలమును శుభ్రం చేసిన జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి జడ్పిహెచ్ఎస్ ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: