దేశానికి ఎనలేని సేవలందించిన వాజ్ పేయ్

ఘనంగా అటల్ బీహారీ వాజ్ పేయ్ జయంతి వేడుకలు

హాజరైన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

దేశవ్యాప్తంగా దివంగత ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారంనాడు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మున్సిపాలిటీలోని ట్రిడెంట్ హాస్పిటల్లో మాజీ ప్రధాని,భారతరత్న  అటల్ బిహారీ వాజ్ పేయ్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దాత్తత్రేయ పాల్గొన్నారు. దత్తాత్రేయతోపాటు బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హాజరై వాజ్ పేయ్ కు నివాళ్లులర్పించారు. ఈ సందర్బంగా ఈ దేశానికి అటల్ బీహారీ వాజ్ పేయ్ అందించిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. రాజకీయ నేతలకు సైతం వాజ్ పేయ్ ఆదర్శప్రాయుడని వారు పేర్కొన్నారు. 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: