ధూం..ధాం..గా పెళ్లిళ్లు వద్దు!

ఉలమాల తీర్మానం, ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు ప్రచారోద్యమం 

భారీ ఖర్చు పెళ్లిళ్లు ఇస్లామ్ స్ఫూర్తికి విరుద్ధం. ఒక్కరోజు పెళ్లికోసం చేసే అప్పులు చాలామంది తల్లిదండ్రుల్ని దారిద్ర్యంలోకి నెట్టేస్తోంది. చాలామంది పేరెంట్స్ తమ స్థాయిని మరిచి కూడా ఆడంబరంగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. మంగ్నీ, హల్దీ, సాచక్, పెళ్లి విందు ఇలా ఎందులోనూ రాజీపడకుండా డబ్బు నీళ్లప్రాయంలా ఖర్చుపెడుతున్నారు. ఘనంగా పెళ్లి జరిపించాలి, లక్షల్లో కట్నం సమర్పించుకోవాలన్న డిమాండు ఆడబిడ్డ తల్లిదండ్రుల్ని కుంగదీస్తోంది. అమ్మాయి పుట్టిన మరుసటి రోజునుంచే బిడ్డ పెళ్లికోసం డబ్బులు జమచేయడం మొదలవుతుంది. కట్నం ఇచ్చుకోవాలనే సాకుతో మగ పిల్లల్ని చదివించకుండా బడి మాన్పించే పనుల్లో పెట్టే తల్లిదండ్రులూ లేకపోలేదు. బిడ్డ కట్నం కోసం ఉన్న ఇంటినీ అమ్మేస్తున్నారు. ఇలా చాలామంది తల్లిదండ్రుల్ని దారిద్ర్యంలోకి నెట్టేస్తున్న వరకట్న మహమ్మారినీ, ఇస్లామ్ వ్యతిరేక వివాహాలనుంచి ముస్లిమ్ సముదాయాన్ని కాపాడేందకు  ముస్లిమ్ పర్సనల్ లా ‘మస్నూన్ నికాహ్’ ప్రచార ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇస్లామ్ సంప్రదాయం ప్రకారం పెళ్లంటే చాలా సులువైన ప్రక్రియ. అమ్మాయి తల్లిదండ్రులకు పైసా ఖర్చుతో పనిలేదు. అబ్బాయి తరపు వారికి అమ్మాయి నచ్చితే కట్టుబట్టలతో నికాహ్ జరిపించి తీసుకెళ్లాలి.


అబ్బాయే అమ్మాయికి మెహర్ కింద కొంత సొమ్మును ముట్టచెప్పాల్సి ఉంటుంది. కానీ నేడు ఇస్లామ్ సంప్రదాయ పద్ధతిలో పెళ్లిళ్లు చాలా అరుదుగా జరుగుతున్నాయ్. ధార్మిక భావాల గలవారమని సొసైటీలో చెలామణి అయ్యేవారు సైతం ఇస్లామ్ సంప్రదాయాలకు విరుద్ధంగా తమ పిల్లల పెళ్లిళ్లు జరుపుతున్నారు. ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు మస్నూన్ నికాహ్ ప్రచార ఉద్యమం ద్వారా ముస్లిమ్ సమాజంలో కొంతలో కొంతైనా మార్పు వస్తుందని ఆశిద్దాం!

రచయిత-ముహమ్మద్ ముజాహిద్

సెల్ నెం-96406-22076


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: