ఓర్వకల్లు మండల కేంద్రంలో,,,

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్)

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం పరిధిలోని స్థానిక ఓర్వకల్లు మండల పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఓర్వకల్లు ఎమ్మార్వో శివ ప్రసాద్ రెడ్డికి రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) వినతిపత్రం అందజేశారు. అనంతరం రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్ర నాథ్,అల్ ఇండియా యూత్ లిగ్  జిల్లా అధ్యక్షుడు రాజు  రాయలసీమ యూత్ యునీయన్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ లు  మాట్లాడుతూ ఓర్వకల్లు మండల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అలాగే ఓర్వకల్లు మండల చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు  దాదాపు 400నుండి500వందల మంది విద్యార్థులు ఉన్నత విద్యాను అభ్యసించడానికి కర్నూలు,నందికోట్కురు, బేతంచెర్ల,నంద్యాల ప్రాంతాలకు వెళ్తున్నారని, అందువల్ల ఓర్వకల్లు చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు  సౌకర్యాలు లేక ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారని,


అమ్మాయిలు ప్రస్తుత   కాలంలో విద్య,వైద్యం,క్రీడ అన్ని రంగాలల్లో వారి ప్రతిభను చాటుకుంటున్నారని,కోన్ని గ్రామాలలో అమ్మాయిలకు 10వ తరగతి పుర్తి అవగానే చిన్న వయసులోనే బాల్యవివాహాలు చేస్తున్నారని,విద్యార్థుల బంగారు భవిష్యత్తు ను ద్రృష్టిలో ఉంచుకుని ఓర్వకల్లు మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అలాగే కాలేజీ కి స్థలం ఏర్పాటు చేయాలని మండల ఎమ్మార్వో శివ ప్రసాద్ రెడ్డికి వినతిపత్రం అందించమని తెలిపారు.ఈవిషయం పై తక్షణమే స్పందించిన ఎమ్మార్వో శివ ప్రసాద్ రెడ్డి విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుకోవడం కోసం డిగ్రీ కళాశాల ఏర్పాటు కు నావంతు క్రృషి చేస్తా అని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ సభ్యులు అనిల్, నవిన్,బజారు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: