ఈ  శిక్షణతో ఏడాదిపొడవున ఉపాధి

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్‌

బాయ్స్ టౌన్‌ లో... ట్రాన్స్ జెండర్ కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్‌లోని బాయ్స్ టౌన్‌ లో మంగళవారంనాడు ట్రాన్స్-ఉమెన్ కోసం జ్యూట్ నూలు, హస్తకళల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్‌ (ఐఏఎస్‌) మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. నెల రోజుల పాటు శిక్షణ పొందే ముప్పై మంది ట్రాన్స్‌జెండర్లు ఏడాది పొడవునా ఉపాధి పొందగలుగుతారు అని ఆమె వెల్లడించారు. బాయ్స్ టౌన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సమన్వయంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం దేశంలోనే మొదటిదన్నారు.


బ్రో. బాయ్స్ టౌన్ డైరెక్టర్ యేసు ప్రభాకరన్ ఈ సభకు స్వాగతం పలుకుతూ, ట్రాన్స్‌జెండర్ల శిక్షణను ఇన్‌స్టిట్యూట్ ప్రధానాంశాల్లో ఒకటిగా మారుస్తుందని అన్నారు. ప్రభావన డైరెక్టర్ దీప, క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముకుంద్ మాల, మోంట్ ఫోర్ట్ సోషల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వర్గీస్ టెక్నాధ్, ట్రాన్స్ జెండర్ కార్యకర్త రచన ముద్రబోయిన తదితరులు మాట్లాడారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: