తెలంగాణ ఉద్యమకారిణి కుటుంబానికి,,,
బాసటగా నిలిచిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఉద్యమకారిణి సుధ కూతురు కు ఎంబీబీఎస్ లో సీటు
ఫీజు నిమిత్తం లక్ష రూపాయలు అందజేసిన ఇంద్రన్న ట్రస్ట్ చైర్మన్, యువనేత కార్తీక్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
తెలంగాణ ఉద్యమకారిణి కుటుంభానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండగా నిలిచారు. ఆ ఉద్యమకారిణి ఇంట పుట్టిన చదవుల తల్లికి నగదు ప్రోత్సాహం అందించి ఉద్యమకారులకు మేం ఉన్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారిలో భరోసా నింపారు. అలా ఓ విద్యా కుసుమానికి మంత్రి అండగా నిలిచారు. మంచి ర్యాంక్ తో ఎంబీబీఎస్ లో సీటు సాధించిన ఆ విద్యార్థినికి ఇంద్రన్న ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయల సహాయం అందించారు.
ఇటీవల సరూర్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారిణి, ప్రస్తుత బిఆర్ఎస్ నాయకురాలు సుధ కూతురు వెన్నెల చదువులో బాగా రాణించడంతో ఆమెను మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. ఆ సమయంలో వెన్నల ఎంబీబీఎస్ సీటు ఫీజుకు సంభందించిన విషయం మంత్రి దృష్టికి రాగా అక్కడికక్కడే సబితా ఇంద్రారెడ్డి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఫీజుకు సంభందించిన లక్ష రూపాయల చెక్ ను ఇంద్రన్న ట్రస్ట్ చైర్మన్ కార్తీక్ రెడ్డి సుధకు అందజేసారు. ఈ సందర్భంగా సుధ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ ఉద్యమకారిణి సుధా ఆమె కూతురు వెన్నెల ధన్యవాదాలు తెలిపారు.
Home
Unlabelled
తెలంగాణ ఉద్యమకారిణి కుటుంబానికి,,, బాసటగా నిలిచిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి,,, ఉద్యమకారిణి సుధ కూతురు కు ఎంబీబీఎస్ లో సీటు,,, ఫీజు నిమిత్తం లక్ష రూపాయలు అందజేసిన ఇంద్రన్న ట్రస్ట్ చైర్మన్, యువనేత కార్తీక్ రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: