క్రిస్మస్ గిఫ్ట్, న్యూఇయర్ గిఫ్ట్ అంటూ లింక్ లను పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు

క్లిక్‌ చేస్తే మీ ఖాతా ఖాళీ

నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి (ఐపీఎఎస్)

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో స్మార్ట్ మొబైల్ ఫోన్ వాడుతున్న ప్రజలు,యువతీ, యువకులకు క్రిస్మస్ గిఫ్ట్, న్యూఇయర్ గిఫ్ట్ అంటూ సైబర్ నేరగాళ్లు చేసే మోసాలపై అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి (ఐపీఎఎస్) సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరంగా మారుతున్న సమాజంలోని పరిస్థితులకు అనుగుణంగా సైబర్ నేరగాళ్లు వారి నేర విధానాలను మార్చుకుంటూ ప్రజలను మోసం చెయ్యడానికి కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని, నూతన సంవత్సరం, క్రిస్మస్ పండుగలు వస్తున్న తరుణంలో ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రజలు క్రయ,విక్రయాలు జరుపుకుంటారని,కొంత మందికి క్రిస్మస్ గిఫ్ట్ అంటూ,న్యూఇయర్ గిఫ్ట్ అంటూ వాట్సాప్ లేదా ఇమెయిల్‌లో సందేశాలు, లింక్ లు వస్తు వస్తుంటాయని,ఆ లింక్ లను క్లిక్ చేసి మోసపోవద్దని, చిన్నగా $500 అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ను గెలుచుకోండని వస్తుంటాయని,ఆ లింక్ లపై క్లిక్ చేసిన తర్వాత దానితో ఓ లింక్ కూడా ఉంటుందని,దీనికి ఇచ్చే కాప్షన్ కూడా మిమ్ములను ఆ లింక్ క్లిక్ చేసే విధంగా ఉంటుందనీ,ఆ లింక్‌పై క్లిక్ చేస్తే అసలు వెబ్‌సైట్‌లా కనిపించే క్లోన్ చేసిన వెబ్‌సైట్ తెరవబడుతుందని,మీ వ్యక్తిగత వివరాలు మీరు ఇచ్చుకుంటూ పోయిన తరువాత,మీ ఫోన్ నంబర్ ఆధారంగా మీ బ్యాంక్ ఎకౌంట్ నుంచి డబ్బులు ఖాళీ అవుతాయని,ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ  అపరిచితుల నుంచి వచ్చిన లింక్ లపై క్లిక్ చేయవద్దని,అదేవిధంగా ప్రజలు వ్యక్తిగత సమాచారం,పాన్‌కార్డు నంబర్,పాన్‌కార్డ్ ఫోటోలు అపరిచిత లింక్ లలో పంప వద్దని,ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,


ప్రజలు సైబర్ నేరానికి గురైన వెంటనే సంబంధిత బ్యాంక్ వారికి, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని లేదా సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు మరియు మీ దగ్గర లోని పోలీసు స్టేషన్ నంబర్ కు గాని  కాల్ చెయ్యాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: