నంద్యాల టూరిస్ట్ హోటల్ పై చర్యలు తీసుకోకపోతే,,

హోటల్ ఎదుట ఆందోళనలు కొనసాగిస్తాం

విద్యార్థి సంఘాల హెచ్చరిక

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల నడిబొడ్డున గల టూరిస్ట్ హోటల్లో గత నాలుగు రోజుల క్రిందట ఇడ్లీ - సాంబారులో "బల్లి" పడిన ఘటనపై - చిన్న "బల్లే" కదా పక్కకు తీసేసి తినండీ అంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తించిన టూరిస్ట్ హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ , బల్లి పడిన సంఘటనపై చర్యలు తీసుకోవడంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏ ఐ వై ఎల్ , ఏ ఐ ఎస్ ఎఫ్ , డీ బీ వై ఎఫ్ , ఆర్ ఎస్ ఏ , జీ వీ ఎస్ , ఏపీ స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో నంద్యాలజిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ గారిని కలసి విషయాన్ని వివరించి పిర్యాదు చేసామని తెలిపారు.ఈ సందర్బంగా ఏఐవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామినేని రాజునాయుడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయుడు, ఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు పూల వెంకట్,జీవీఎస్ రాయలసీమ అధ్యక్షుడు రవీంద్ర నాయక్,ఏపీఎస్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు వేణు మాధవ రెడ్డి , డీబీవైఎఎఫ్ నాగన్న తదితరులుమాట్లాడుతూ ఈనెల 8వ తేదీన నంద్యాలలోని టూరిస్టు హోటల్లో విజయవాడకు చెందిన పెళ్లి బృందం పెళ్లి నిమిత్తం నంద్యాలకు రాగా,వారు అల్పాహారం కోసం స్ధానిక టూరిస్టు హోటల్లో ఇడ్లీ - సాంబారు ఆర్డరు ఇచ్చారని,ఇడ్డీ తింటున్న పెళ్లి కొడుకు పాత్రలో బల్లి రావడంపై ఖంగుతున్న వారు యాజమాన్యాన్ని ఇందేంటని ప్రశ్నించగా చిన్న బల్లే కదా - పక్కకు తీసేసి తినండీ అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ కస్టమర్లపై దాడికి పాల్పడటం సిగ్గుచేటన్నారు.కస్టమర్లే దేవుల్లు అంటూ - అధిక రేట్లకు ఆహార పదార్దాలను అమ్ముతూ ఆర్ధిక దోపిడీ చేస్తూ ప్రజలను సంక్షేమాన్ని గాలికి వదిలేసిన టూరిస్ట్ హోటల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని,ఇప్పటికైనా జిల్లా స్ధాయి ఫుడ్ సేఫ్టీ అధికారులు టూరిస్ట్ హోటల్ ఫుడ్ లైసెన్స్ గుర్తింపును రద్దు చేసి హోటల్ ను సీజ్ చేయాలని,లేని పక్షంలో హోటల్ ఎదుట భారీ ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: