గడివేముల మండలంలో ముగిసిన

వైజ్ఞానిక ప్రదర్శనశాలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలో గడివేముల మండల ఎంఈఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గడివేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో వైజ్ఞానిక ప్రదర్శనశాల నిర్వహించారు. వైజ్ఞానిక ప్రదర్శనశాలలో గడివేముల జడ్పీహెచ్ఎస్ మరియు ఉర్దూ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు,మోడల్ స్కూల్ విద్యార్థినీ,విద్యార్థులు, గని పాఠశాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు, శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల విద్యార్థినిలు తయారుచేసిన వస్తువులను ప్రదర్శించారు.


ఈ సందర్భంగా గడివేముల మండల ఎంఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ పిల్లలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి పిల్లలను ఆలోచింపచేసే విధంగా ప్రేరేపించడానికి వైజ్ఞానిక ప్రదర్శనశాలను నిర్వహించామని తెలిపారు.అనంతరం పిల్లలలో ఉండే సృజనాత్మక ను వెలికి తీసిన పాఠశాలల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను అభినందించారు.వైజ్ఞానిక ప్రదర్శనశాలను మండలంలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు వాటిని ఎలా తయారు చేశారు వాటి వల్ల కలిగే ఉపయోగాలను తయారుచేసిన విద్యార్థిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండల ఎంఈఓ శ్రీనివాసులు,వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: