ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పోతుల నాగరాజు కు ఓటు వేయండి

విస్తృత ప్రచారం చేపట్టిన విద్యార్థి యువజన సంఘాలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో పాణ్యం మండల కేంద్రంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పోతుల నాగరాజును ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను, నిరుద్యోగులను కలిసి మార్చిలో జరిగే ఎమ్మెల్సీ డాక్టర్ పోతుల నాగరాజుని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలలో నిరుద్యోగుల కోసం,కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల కోసం, రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం,ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం శాసనమండలిలో ఎవరైతే మాట్లాడుతారో అలాంటి వారికి ఓటు వేయాలని, డాక్టర్ పోతుల నాగరాజు 33 సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమాలలో పనిచేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కొద్ది రోజులు పని చేసి 2007 లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసి కేవలం 454 ఓట్ల తేడాతో ఓడిపోయారని, మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో


పి డి ఎఫ్ ఎమ్మెల్సీలు,ఎస్ టి యు, యు టి ఎఫ్,ఎస్ ఎఫ్ ఐ,ఏ ఐ ఎస్ ఎఫ్,డి వై ఎఫ్ ఐ, ఏ ఐ వై ఎఫ్,ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్టులు,మేధావులు, విద్యావంతులు,జనవిజ్ఞాన వేదిక,ఎస్కే యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ,ఎస్వీ యూనివర్సిటీ,యోగి వేమన యూనివర్సిటీ సభ్యుల అందరి మద్దతుతో పోటీ చేస్తున్నారు పి డి ఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పోతుల నాగరాజు గారికి మద్దతుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ, ఏ ఐ ఎస్ బి స్టేట్ కౌన్సిల్ మెంబర్ వనం వెంకటాద్రి, ఆర్ వి ఎఫ్ జిల్లా అధ్యక్షులు బత్తిన ప్రతాప్,జిల్లా ప్రధాన కార్యదర్శి రియాజ్,హరి, నవీన్,రమణ,సూర్య కుమార్,సురేష్,మనోహర్, రాజేష్,అనిల్ తదితరులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: