పర్యావరణ, నిరుపేద విద్యార్థుల అభ్యున్నతికి చేయూత నిచ్చేలా..

నూతన సంవత్సర వేడుకలు జరుపుకొందాం

రెడ్ క్రాస్,...జన విజ్ఞానవేదిక పిలుపు

(జానో జాగో వెబ్ న్యూస్ -నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను "మొక్కలతో,పుస్తకాలతో జరుపుకుందాం" అనే పోస్టర్లను నంద్యాల జిల్లాకలెక్టర్,ఎస్పీ,ఎంపీ, జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మనజీర్ జిలాని సామాన్, ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ"నూతన సంవత్సర వేడుకలను మొక్కలతో,పుస్తకాలతో జరుపుకోవాలని ఇండియన్ రెడ్ క్రాస్ మరియు జన విజ్ఞాన వేదిక వారి విజ్ఞప్తి మేరకు జిల్లా అధికారులు,నాయకులు మాట్లాడుతూ


నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసే అభిమానులు, సంబంధిత అధికారులు, శ్రేయోభిలాషులు అందరూ పూల బొకేలు కాకుండా మొక్కలు తీసుకుని వచ్చి నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు చేసినట్లు అవుతుందని, నిరుపేద విద్యార్థులకు విద్యాసామాగ్రి అయిన పుస్తకాలు,పెన్ను,పెన్సిల్, విద్యార్థుల జ్ఞానాన్ని పెంపొందించే లైబ్రరీ పుస్తకాలు లాంటివి తీసుకువచ్చి శుభాకాంక్షలు తెలుపుకోవాలని,రెడ్ క్రాస్ మరియు జన విజ్ఞాన వేదిక సభ్యుల ద్వారా వీటిని సేకరించి విద్యాశాఖ వారి సహకారంతో నిరుపేద పిల్లలు చదివే స్కూళ్లలో, హాస్టల్లో వీటిని పంపిణీ చేయడం జరుగుతుందని, మిత్రులు,అభిమానులు పుస్తకాలు,మొక్కల ద్వారా శుభాకాంక్షలు తెలుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పర్ల దస్తగిరి, వైస్ చైర్మన్ మారుతి కుమార్, కోశాధికారి నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు,ఉస్మాన్ భాష,మద్దిలేటి, తెలకపల్లి చైతన్య డిఎస్ రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: