సెట్విన్ శిక్షణ కోర్సులకు యువత నుంచి అపూర్వ స్పందన

వీటి దృష్టిలో ఉంచుకొని శిక్షణ పొందే వారి సంఖ్యను ప్రతి ఏడాది పెంచుతున్నాం

త్వరలో నగర శివారులలో సెట్విన్ శిక్షణ కేంద్రాలు

సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె. వేణుగోపాలరావు 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

సెట్విన్ సంస్థ అందిస్తున్న శిక్షణ కోర్సులకు నిరుద్యోగ యువత నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాలరావు వెల్లడించారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏడాది శిక్షణ పొందే వారి సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్నామన్నారు. సెట్విన్ సంస్థ ఇస్తున్న శిక్షణ కోర్సులకు డిమాండ్ పెరుగనుండడంతో నగర శివారు ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించాలని నిర్ణయించినట్లు వేణుగోపాలరావు వెల్లడించారు. సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టి తాను ఐదేళ్లు పూర్తి చేసుకున్నానని, ఈ ఐదేళ్ల కాలంలో ఎంతోమంది నిరుద్యోగ యువత శిక్షణ కోర్సుల్లో శిక్షణ పొంది లబ్ధి పొందారని ఆయన వెల్లడించారు. బుధవారం నాడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సెట్విన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కే వేణుగోపాలరావు మాట్లాడారు. తాను బాధ్యతలు చేపట్టిన ఐదేళ్ల కాలంలోపూర్తి చేసుకున్న సందర్భంగా తాను చేపట్టిన వివిధ సధకాలు, శిక్షణ కోర్సులు, కేంద్రాల వివరాలను కే వేణుగోపాలరావు వెల్లడించారు.

ప్రస్తుతం సెట్విన్లో 58 కోర్సుల్లో 3 నెలల నుంచి సంవత్సరం పాటు శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో మొబైల్ టెక్నీషియన్, సీసీ కెమెరా, సోలార్ టెక్నీషియన్, హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులు మొదలైనవి ప్రారంభించుకోవడంతో వివిధ నిరుద్యోగ యువత నుంచి మంచి ప్రోత్సాహం లభించిందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్ నియోజకవర్గం అభివృద్ధి నిధుల నుంచి సీతాఫల్మండిలో ఓ అధునాతన సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు.


ఫిర్జాదిగూడలో స్థానిక మేయర్ జక్కా వెంకటరెడ్డి సహకారంతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఒక ఏడాది కాలంలో ఈ రెండు కేంద్రాల్లో సుమారు 3వేల మంది శిక్షణ పొందడం నాకు గర్వంగా ఉందన్నారు, గజ్వేల్, డిచ్ పల్లి లో కూడా నూతన శిక్షణ కేంద్రాలను విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం శిక్షణ ఇచ్చే అభ్యర్థుల సంఖ్య పెంచుకుంటూ వస్తున్న తరుణంలో కోటెడ్ మహమ్మారి కారణంగా సుమారు 6 నెలల పాటు శిక్షణ కేంద్రాలు మూత వడడంతో 2020-21 సంవత్సరంంలో 50 శాతం అభ్యర్థులకు శిక్షణ అందించడం జరిగింది.

మళ్లీ కోటెడ్ తర్వాత 2021-22. 2022-23లో చక్కని ఫలితాలను ఇంచగలిగామని ఆయన తెలిపారు. ఏసి (గార్డ్ కేంద్రాన్ని పూర్తిగా ఆధునీకరించిఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ చేతులమీదుగా ప్రారంభించబోతున్నామని ఆయన వెల్లడించారు. త్వరలో నగర శివారులో కూడా కొత్త సెట్విన్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఆన్లైన్ శిక్షణకు కూడా ప్రాధాన్యతను గమనించి 'సెట్విన్ ఆన్లైన్: పోర్టల్ ద్వారా కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నామన్నారు. తెలంగాణ నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు సహకారంతో నిర్మాణరంగ కార్మికుల పిల్లలకు సుమారు 35వేల మందికి ఈ ఆన్లైన్ శిక్షణ అందించామని పేర్కొన్నారు.

ఈ ఐదు సంవత్సరాల కాలంలో పాత్రికేయుల ప్రోత్సాహం, సహకారానికి నా యొక్క హృదయపూర్వం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.సెట్విన్ ఆదాయం పెంచడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పనకు సహాయపడ్డ నా తోటి ఉద్యోగులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారం కలాగే అందిస్తారని ఆశిస్తున్నానని కే వేణుగోపాలరావు పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: