హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ వారి అధ్యర్వంలో...
రక్తదాన శిబిరం ఏర్పాటు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
భారతదేశ వ్యాప్తంగా హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ఆధ్వర్యంలో "పరివర్తన్" వారోత్సవాల్లో భాగంగా గత 13 సంవత్సరాల నుండి ప్రజలకు రక్తదానాలపట్ల అవగాహన కల్పించి రక్తకోరత లేని సమాజం నిర్మించాలనే సంకల్పంలో భాగంగా హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ సర్కిల్ హెడ్ ఉమేష్ కృష్ణ,నంద్యాల బ్రాంచ్ మ్యానేజర్ రామకృష్ణ,ఆపరేషన్స్ మేనేజర్ రామకృష్ణ రెడ్డి మరియు అసిస్టెంట్ మ్యానేజర్ హుస్సేన్ బాషా కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్కిల్ హెడ్ ఉమేష్ కృష్ణ మాట్లాడుతూ హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ 2007 వ సంవత్సరంలో బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను ప్రారంభించామని, ఆపరేషన్స్ హెడ్ మిస్టర్ భావేష్ జావేరి మార్గదర్శకత్వంలో దేశవ్యాప్తంగా 4 వేల పైగా యూనిట్స్ ను సేకరించామని, అప్పటినుండి 2019 వ సంవత్సరం వరకు మాకు కళాశాలలు,కార్పొరేట్ మరియు వివిధ స్వచ్ఛందసంస్థల భాగస్వామ్యంతో భారతదేశమంతటా సుమారుగా 4 లక్షల యూనిట్స్ ని సేకరించామని,కరోనా ఆటంకం వల్ల గత 2 సంవత్సరాలు సేకరణ చేయలేకపోయామని,ఈ సంవత్సరం నుండి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని,ఈ సంవత్సరంతో 14 వ సంవత్సరం అవుతుందని. అలాగే సమాజంలో రక్తం యొక్క అవసరం పెరిగినందున ఇంకా మెరుగ్గా పనిచేసి ఎక్కువ రక్తం యూనిట్స్ ను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని,ప్రతి వ్యక్తికి మరియు సిబ్బందికి రక్తదానం పట్ల అవగాహన పెంపొందించడానికి మరియు రక్త కొరత తగ్గించ్చడానికి ఒక బాధ్యతగా తీసుకుంటున్నామని తెలియజేసారు. 9-12-2022 వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కర్నూలు జిల్లా నగరంలోని మౌర్య ఇన్ కాంప్లెక్స్ నందు మరియు నంద్యాల జిల్లా నగరంలోని ఎన్.కె.రోడ్, శోభ హోటల్ ప్రక్కన ఉన్న హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ బ్రాంచ్ లలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ రక్తదాన శిబిరాలలో ప్రతిఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొనాలని మీ అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి మేము చేస్తున్న ఈ మంచి కార్యక్రమంలో మీరందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రక్తదానం చేయాలనుకున్న వారు దయచేసి ఈనెంబర్లను సంప్రదించగలరని తెలిపారు. సెల్ : 9949740337. 8688813153.
Home
Unlabelled
హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ వారి అధ్యర్వంలో.... రక్తదాన శిబిరం ఏర్పాటు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: