రవాణా నిబంధనలు ఉల్లంఘిస్తున్న,,,
నారాయణ పాఠశాలల బస్సులను సీజ్ చేయాలి
నంద్యాల జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి ధనంజయుడు డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలోని నారాయణ విద్యాసంస్థలు రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుపుతున్న స్కూల్ బస్సులను సీజ్ చేయాలని నంద్యాల జిల్లా రవాణా అధికారి (డీటీఓ) నిరంజన్ రెడ్డికి వినతి పత్రం అందజేశామని నంద్యాల జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి ధనుంజయుడు తెలిపారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు మాట్లాడుతూ స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్న నారాయణ స్కూల్ యాజమాన్యం బస్సు ఫీజుల పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుండి వేలకు వేల రూపాయలు వసూలు చేసి 30 మంది పట్టే పాఠశాలల బస్సులో 50 మంది విద్యార్థులను ఎక్కించుకుంటున్నారని, విద్యార్థులు కూర్చోడానికి కూడా స్థలం లేదని ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రులతో నారాయణ పాఠశాల బస్సు సిబ్బంది పాఠశాల యాజమాన్యం ఆదేశాల మేరకే విద్యార్థిని విద్యార్థులను ఎక్కించుకుంటున్నామని, ఇష్టమైతే పంపించండి లేకపోతే మానుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ
విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా ఎక్కించుకుంటున్నారని,30 మంది విద్యార్థులు వెళ్లే బస్సు లో 50 మందిని ఎక్కించుకొని రావడం వల్ల విద్యార్థుల లంచ్ బ్యాగులు,స్కూల్ బ్యాగ్లు వారి మీదనే పెట్టుకొని ప్రయాణం చేసి పాఠశాలకు వస్తున్నారని,పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని రావడమే కాకుండా నారాయణ పాఠశాలల బస్ లు పట్టణంలో అతివేగంగా నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న నారాయణ స్కూల్ బస్సులను నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా రవాణా రవాణా శాఖ అధికారి (డీటీఓ) కార్యాలయం ఎదుట ప్రత్యక్ష ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నంద్యాల పట్టణ ఆర్గనైజింగ్ కార్యదర్శి మనోహర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సుమన్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
రవాణా నిబంధనలు ఉల్లంఘిస్తున్న,,, నారాయణ పాఠశాలల బస్సులను సీజ్ చేయాలి,,, నంద్యాల జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి ధనంజయుడు డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: