అన్ని చెరువులను సుందరీకరిస్తాం
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రోబోటిక్ ట్రాష్ కలెక్టింగ్ బోట్ ను ప్రారంభించిన మంత్రి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
హెచ్ ఎం డి ఏ పరిధిలో ఎఫ్టిఎల్ ను గుర్తించి, అన్ని చెరువులను సుందరికరించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన (సంద) చెరువు లో గుర్రపు డెక్క మరియు ప్లాస్టిక్ వ్యర్ధాలను తీసే విహంతరి రోబోటిక్ ట్రాష్ కలెక్టింగ్ బోట్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... యువ శాస్త్రవేత్తగా ఒక యువకుడు సోలార్ సహాయంతో రిమోట్ కంట్రోల్ తో పనిచేసే నూతన యంత్రాన్ని కనుగొనడంతో,
తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం లభిస్తుండటంతో నూతన ఆవిష్కరణకు ప్రోత్సాహకంగా ఉంటుందని ప్రత్యేకంగా తెప్పించినట్లు మంత్రి తెలిపారు. నగరంలోని దుర్గం చెరువు గతంలో ఎట్లా ఉండేది ప్రస్తుతం ఎట్లా ఉందొ చూడాలని,దశలవారీగా నియోజకవర్గములోని అన్ని చెరువుల్లో గుర్రెపు డెక్క,చెత్త తొలిగించి సుందరికరిస్తాం అన్నారు. మురికినీరు చెరువులోకి రాకుండా 23 కోట్లతో ముందుగా ట్రంక్ లైన్ పనులు చేపట్టినట్లు,అన్ని చెరువుల్లో ఇదే విధంగా వర్షం నీరు,డ్రైనేజీ నీరు ప్రత్యేకంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల్లో పూడికతీత తీయటంతో నేడు వాటిలో జలకళ వచిందన్నారు.
పట్టణాల్లో కూడా ఇదే విధంగా చెరువుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలు నాడు-నేడు వచ్చిన మార్పును గమనించాలని అందరూ కలిసి బాధ్యత గా చెరువులను కాపాడుకోవాలని,పరిశుభ్రంగా ఉంచాలన్నారు.వాకార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసుకొని చెరువులను పరిరక్షించుకోవలన్నారు. చెరువుల బాగు కోసం మంచి పనులు చేపడుతుంటే,నిత్యం వందలాది మంది చెరువుల చెంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సెదదిరటం,పోటీ పరీక్షల అభ్యర్థులు కసరత్తులు, ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తుండటంతో జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేయడం శోచనీయమన్నారు.
కొత్త సంవత్సరం లో ఒక కొత్త ఆలోచనతో ముందుకెళ్దామని,బొకేలు,శాలువాల స్థానంలో విద్యార్థులకు, అంగన్ వాడి పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పిలుపునిచ్చారు... రానున్న నూతన సంవత్సరం 2023 సందర్భంగా అందరికి ముందస్తుగా శుభాకాంక్షలు తెల్పిన మంత్రి తనతో పాటు ఎవరిని కలువటానికి వెళ్లిన బొకేలు, శాలువల స్థానంలో నోట్ పుస్తకాలు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, మ్యాట్లు, పెన్నులు, పెన్సిళ్లు, తదితర వాటిని విద్యార్థులకు అందజేయాలని కోరారు.
అదేవిధంగా గ్రామాల్లో, వార్డులలో గల పాఠశాలలను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, కార్పోరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Home
Unlabelled
అన్ని చెరువులను సుందరీకరిస్తాం,,, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ,,,,,రోబోటిక్ ట్రాష్ కలెక్టింగ్ బోట్ ను ప్రారంభించిన మంత్రి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: