బొమ్మలసత్రంలో "గుడి-బడీ" దగ్గరలో ఉన్న వైన్ షాప్ ఎత్తివేయాలి

ఏఐఎస్ఎఫ్,,,,ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ఫ్లైఓవర్ కింద"బడి-గుడి"దగ్గరలో ఉన్న వైన్ షాపును ఎత్తివేయాలని ఏఐఎస్ఎఫ్,,, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు ఎక్స్చేంజ్ అధికారులను కోరాయి. విరాలలోకి వెళితే స్థానిక నంద్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు,ఏ ఐ ఎస్ ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయడు మాట్లాడుతూ,,, నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఏర్పాటు చేసినటువంటి వైన్ షాపును తక్షణమే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. "బడి-గుడి" దగ్గర్లో వైన్ షాప్ ను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని వారు అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి రాక ముందు  పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక తన మంత్రులు,ఎమ్మెల్యేలతో మద్యం పరిశ్రమలు నెలకొల్పి రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులుగా పారిస్తూ, అమ్ముతూ కుటుంబాలలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని,


నిత్యం విద్యార్థులతో, మహిళలతో,ప్రజలతో రద్దీగా ఉండే బొమ్మల సత్రం ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద వైన్ షాప్ పెట్టడానికి అనుమతి ఇచ్చిన ఎక్సైజ్ అధికారులపై, సంబంధిత అధికారులపై  హైకోర్టులో కేసు వేసి స్టే  తీసుకొస్తామని వారు హెచ్చరించారు. తక్షణమే అక్కడ వైన్ షాప్ ను  ఎత్తివేయకపోతే విద్యార్థులతో,ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని వారు అధికారులను హెచ్చరించారు. బొమ్మలసత్రం బ్రిడ్జి కింద వైన్ షాప్ ను ఏర్పాటు చేయడం వల్ల మహిళా విద్యార్థులకు రక్షణ కు ఆటంకం కలుగుతుందని, అధికారులు ఎందుకు ఈ విషయం పైన దృష్టి ఎందుకు సారించడం లేదని, తక్షణమే బొమ్మల సత్రం ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఏర్పాటు చేసినటువంటి వైన్ షాపును ఎత్తివేయాలని లేకపోతే ఎక్సైజ్ సూపర్డెంట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రిస్వామి, నంద్యాల పట్టన్క్ ఆర్గనైజింగ్ కార్యదర్శి మనోహర్, ఏ ఐ వై ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శులు  విష్ణు, రవి, నాయకులు శశి,చంద్రతదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: