ఏపీ మోడల్ స్కూల్ లో ట్యాబులను పంపిణీ చేసిన..

గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలంలో స్థానిక ఏపీ మోడల్ స్కూల్ నందు మండలంలో  ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులకు ఉచిత ట్యాబులను జడ్పిటిసి సభ్యులు ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద విద్యార్థిని, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, నాడు నేడు,అమ్మ ఒడి వంటి ఉచిత పథకాలు ప్రవేశపెట్టిన జగనన్న నేడు అత్యంత ఖరీదైన నాణ్యమైన బైజుస్ యాప్ కలిగిన ట్యాబులను అందించారని,


ఈ ట్యాబ్లను విద్యార్థులు సద్వినియోగపరచుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.అనంతరం గడివేముల మండల ఎంఈఓ రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న గ్రామీణ విద్యార్థిని,విద్యార్థులు సాంకేతిక పరంగా నాణ్యమైన విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రివర్యులు విద్యార్థులకు ఉచిత ట్యాబ్ లను అందించారని, ట్యాబ్లలో ఏదైనా సమస్య వస్తే తమ దృష్టికి తీసుకురావాలని, ఇతరులతో రిపేర్లు చేయించరాదని,విద్యకు మాత్రమే ట్యాబ్ లను ఉపయోగించాలని, విద్యార్థులు ఎంత సమయము విద్యకు ఉపయోగిస్తున్నారో రాష్ట్ర కార్యాలయానికి సమాచారం వెళ్లే విధంగా యాప్  రూపొందించారని తెలిపారు.

అనంతరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 450 మంది విద్యార్థిని,విద్యార్థులకు మరియు 8వ తరగతి బోధిస్తున్న 48 మంది ఉపాధ్యాయులకు  ట్యాబులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ , ఈఓఆర్డి  అబ్దుల్ ఖాలిక్ భాష,ఎమ్మార్వో శ్రీనివాసులు,మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి శైలజ,వైసీపీ నాయకులు, శేఖర్ రెడ్డి,బాల చిన్ని, మండలంలోని ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: