అంగరంగ వైభవంగా.. 

శ్రీశ్రీశ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయంలో  విగ్రహ పున:ప్రతిష్టాపన మహోత్సవం

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

దూద్ బౌలిలోని శ్రీశ్రీశ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయంలో  విగ్రహ పున:ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. తమిళనాడులోని మధురై ప్రాంతంలోని మహాబలేశ్వరం నుండి రూపుదిద్దుకున్న  పైనీరు ముత్యాలమ్మ దేవాలయ  అమ్మవారి విగ్రహాన్ని భారీ ఊరేగింపుతో దేవాలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు మహిళలు హారతులు చేతబోని అమ్మవారికి ఘనస్వాగతం పలికారు.


మహారాజ్ గంజ్ నుండి అమ్మవారి ఊరేగింపు ప్రారంభమై మామిడికాయ మటం దూద్ బోలి చౌరస్తా కస్తూర్బా పాఠశాల మీదుగా దేవాలయానికి చేరుకుంది .ఈ సందర్భంగా బస్తీ వాసులు, భక్తులు గడపగడపకు అమ్మవారికి సాక మరియూ హారతి ఇచ్చి స్వాగతం పలికారు. వేద పండితుల తో సకల దేవతల మండప అలంకారము, గణపతి హోమం ఘనంగా నిర్వహించారు ఈ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా ఆలయ నిర్వహకులు మాట్లాడుతూ

శనివారం ఉదయం 8గంటలకు మహాగణపతి పూజ, పుణ్యావాచనం, పంచగవ్య ప్రాశనం, రుత్విక్ వరణం, రక్షాకంకణధారణ, అఖండ దీపారాధన ఉంటుందని తెలిపారు. ఉదయం 9:30 నిమిషాలకు మృత్ సంగ్రహణం, అంకురారోపనం, ఉదయం 11 గంటలకు సర్వతోభద్రవాస్తు యోగిని, క్షేత్రపాలక, నవగ్రహ మాతృక, ప్రధాన కులశస్థాపన పూజ జరుగు ఉందన్నారు. అనంతరం 11:30లకు అదే రోజు సాయంత్రం 7 గంటలకు పూజలు, హోమాలు, ధన్యాదివాసంం, ధనాధివాసం, వస్త్రాదివాసాలు జరుగుతాయని వెల్లడించారు.

చివరి రోజైన 18వ తేదీనాడు ప్రాతకాలపు పూజలు, హోమాలు, గరిక పూజలు, పీఠపూజలు, గర్తన్యాసం, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, అష్టబలి, మహాబలి, చండిహోమం నిర్వహిస్తారని, అనంతరం అన్నప్రసాద వితరణ జరుగుతుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న భక్తులు పాల్గొన్నాలని వారు పిలుపునిచ్చారు. .

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: