మిరపపంటలో తోట బడి నిర్వహించిన..
వ్యవసా య శాఖ అధికారులు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని పెసర వాయి గ్రామంలో వ్యవసాయ శాఖ మరియు హెచ్ ఓ దివ్య ఆధ్వర్యంలో రైతు సోదరులకు మిరప పంట సస్యరక్షణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతునులతో మిరప పంట సస్యశ్యామలంగా ఉండాలంటే కానుగ పిండి మరియు వేప పిండి మిరప పంటపై వేరువేరుగా ఎకరానికి ఒక కేజీ చొప్పున పిచికారి చేయాలని, మిరప పంటలో తెలుపు,పసుపు మరియు నీలిరంగు జిగురు అట్టలు, ఒక ఎకరాకు 40 అట్టలు పంట పొలంలో అమర్చుకోవాలని,తెలుపు మరియు
నీలి అట్టలకు తామర పురుగులు,పచ్చ అట్టలకు తెల్ల దోమ ఆకర్షింపబడి చనిపోతాయనీ.పొలంబడి కార్యక్రమంలో పాల్గొన్న 30 మంది రైతు సోదరులకు 25 ఎకరాలలో మిరప పంట పండించిన రైతు సోదరులకు విత్తనం నుండి పంట చేతికి వచ్చే వరకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండల వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి, హెచ్ ఓ దివ్య,పెసర వాయి గ్రామ రైతు సోదరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
మిరపపంటలో తోట బడి నిర్వహించిన.. వ్యవసా య శాఖ అధికారులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: