మంత్రాల చెరువును పరిశీలించిన...
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సుడిగాడి పర్యటనలో ప్రజలతో మమేకం... మహిళలతో ఆప్యాయ పలకరింపు
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. దీంతోపాటు బండ్ నిర్మాణంతో పాటు జరుగుతున్న సుందరికరణ పనులను ఎంఎంసి మేయర్, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లు, అధికారులు, పార్టీ అధ్యక్షులు, నాయకులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనిఖీ చేసారు. ఈ సందర్భంగా వాకింగ్ చేస్తున్న మహిళలతో ముచ్చటించారు.చందనం చేరువులాగా సుందరికరించాలని వాకింగ్ చేస్తున్న వారు కోరగా పనులన్నీ పూర్తి అయితే ఈ ప్రాంత రూపురేఖలే పూర్తిగా మారిపోతాయని ఈ సందర్భంగా మంత్రి వారితో అన్నారు.
బాగా అభివృద్ధి చేస్తున్నారని, వాకింగ్ తో పాటు, చిన్నారులు అడుకోవటానికి, ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న వారికి ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ఓపెన్ జిమ్ తో పాటు క్రీడా పరికరాలు ఏర్పాటు కానున్నాయి.ఇప్పటికే ఒక కోటి 50 లక్షలు బండ్ నిర్మాణంతో పాటు చెరువు సుందరికరణకు మంజూరు అయ్యాయి.మంత్రి చెరువు చుట్టూ నడిచి అధికారులకు పలు సూచనలు చేసారు.స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారంతా మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో సెదదిరాటానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
Home
Unlabelled
మంత్రాల చెరువును పరిశీలించిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి,,,, సుడిగాడి పర్యటనలో ప్రజలతో మమేకం... మహిళలతో ఆప్యాయ పలకరింపు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: