జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా,,,
జిల్లాస్థాయి వ్యాసారచన పోటీలు
విజేతలుగా నిలిచిన పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ వినియోగ దారుల దినోత్సవం సరదర్భంగా జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలను నిర్వహించారు. వ్యాసరచన పోటీలలో పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు వి.శ్రీనివాసులు ఎం గౌరీ లు ఆంగ్లభాష విభాగంలో ప్రథమ మరియు ద్వితీయ బహుమతులను గెలుపొందారు. వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారినీ అనురాధ ప్రధమ బహుమతి 3000, ద్వితీయ బహుమతి 2000 రూపాయల నగదు తో పాటు ప్రశంశాపత్రాలను మేమెంటోలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, తూనికలు కొలతల అధికారి, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షుడు అమీర్ భాష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలలో విజేతలైన విద్యార్థులను పాణ్యం ఎంఈఓ కోటయ్య, పాఠశాల హెచ్ఎం జిలాన్ బాషా, పాఠశాల సిబ్బంది
అభినందించారు.
Home
Unlabelled
జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా,,, జిల్లాస్థాయి వ్యాసారచన పోటీలు,,, విజేతలుగా నిలిచిన పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: