రధాలయం నిలుపుదల నిర్మాణాన్ని ప్రారంభించిన... 

పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని గడిగరేవుల గ్రామంలో వెలిసి దక్షిణ కాశీగా పేరుపొందిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని రదాలయ నిలుపుదల స్తల ప్రాంగణాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భూమి పూజ చేసి పాణ్యం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు.


వివరాల్లోకి వెళితే శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని రథాలయ నిలుపుదలకు కావలసిన వసతి నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి,శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం జ్ఞాపకనుఅందజేశారు. అనంతరం శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి రధాలయ నిలుపుదలకు ఉపయోగించే స్థలమును మంత్రోచ్ఛరణల మధ్య భూమి పూజ చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎండోమెంట్ అధికారి  సుధాకర్ రెడ్డి,

దేవస్థానం ఈవో,శ్రే దుర్గ భోగేశ్వర స్వామి ప్రధానార్చకులు శ్యామసుందర శర్మ, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: