మాండూస్ తుఫాన్ తాకిడితో...
నిండా మునిగిన రైతన్నలు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలో మాండూస్ తుఫాన్ తాకిడికి రైతన్నలు అల్లాడిపోతున్నారు. గడివేముల మండల పరిధిలో అధిక విస్తీర్ణంలో మిరప, వరి, మొక్కజొన్న, మినుము పంట పండించిన రైతన్నలకు మాండూస్ తుఫాన్ రైతుల కంటి వెంట కన్నీరు తెప్పిస్తుంది. పంట చేతికి వచ్చి పంటను కోసి కలాలలో ఆరబెట్టుకున్నారు. పంటలు బాగా పండాయని, పండిన పంటకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది అని రైతన్నలు సంతోషిస్తున్న వేళ మాండూస్ తుఫాన్ రూపంలో ప్రకృతి రైతన్న పై కన్నెర్ర చేసి రైతన్నల కంటి వెంట కన్నీరు మిగిల్చింది.
తుఫాన్ తాకిడికి కలాలలో ఆరబెట్టిన మిరప మరియు వరి పంటలు తడిసి ముద్దయి పోయాయి. పంటను కాపాడుకునేందుకు రైతన్నలు కప్పిన పట్టలు సైతం మాండుస్ తుఫాన్ ముందు తలవంచి పంట మొత్తం తడిసి ముద్దయిపోయింది. మిరప, వరి పంటలో నీరు చేరడంతో మిరపకాయలకు కొన్ని చోట్ల బూజు వచ్చి పంట దెబ్బతింది. పంట పండించేందుకు రైతులు వేలకు వేలు ఖర్చుపెట్టి పంటను పండించామని మాoడూస్ తుపాన్ దెబ్బతో మిరప, వరి పంటలకు సరైన గిట్టుబాటు ధర వస్తుందో లేదో అని రైతన్నలు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
Home
Unlabelled
మాండూస్ తుఫాన్ తాకిడితో..... నిండా మునిగిన రైతన్నలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: