అంబేద్కర్ విగ్రహానికి...ఘన నివాళి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  66 వ వర్ధంతి సందర్భంగా పాణ్యం లో ఎంపీడీవో ఆఫీస్ దగ్గర ఉన్న అంబేద్కర్  విగ్రహానికి ఘనంగా పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ గారని, రాజ్యాంగ నిర్మాతగా ప్రజలందరికీ సమన్యాయం చేసిన మహోన్నత వ్యక్తి అని వారు తెలిపారు.


ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా డీఈవో అనురాధ, పాణ్యం ఎస్సై సుధాకర్ రెడ్డి, పాణ్యం ఎంఈఓ కోటయ్య, విద్యార్థి యువజన సంఘాలు ప్రజాసంఘాల నాయకులు పెరుగు శివకృష్ణ , వనం వెంకటాద్రి, భాస్కర్, దేవ దత్తు, బత్తినప్రతాప్, రియాజ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ దినేష్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ వీరేష్, టీచర్ గోవిందు, సిఆర్పి హరి, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు చిరు , నాగరాజు, ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

 Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: