భారీ కాన్వయ్ తో  ప్రజా సంగ్రామ ముగింపు సభకు,,,

హాజరైన బుక్కా వేణుగోపాల్

తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలని ఆకాంక్ష

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్ర నగర్ ప్రతినిధి)

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ 5వ విడుత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి నాయకులతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హాజరయ్యారు. కరీనగరంలోని . ఎస్.ఆర్.ఆర్ కాలేజ్ గౌండ్స్ లో ఐదవ విడుత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథి బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ బహిరంగ సభకు భారీ కాన్వాయ్ తో రాజేంద్ర నగర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకుల. బుక్క వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్ యొక్క నియంతృత్వ, అవినీతి, రాచరికపు పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కావాల్సిన అసరముందని బుక్క వేణుగోపాల్ ఆకాంక్షించారు.


రాష్ట్రమంతటా ప్రజాదేవుళ్లను, ప్రజాసంఘాలను కలుసుకుంటూ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బండి సంజయ్ కి ఆ కరీనగరం మహాశక్తి అమ్మవారు శక్తినివ్వవాలని ఆయన ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మండల ఓబీసీ మోర్చ అధ్యక్షులు మల్చాలం మోహన్ రావు, నర్కూడ సర్పంచ్, మండల ఎస్సి మోర్చ అధ్యక్షులు సునిగంటి సిద్దులు, మండల కార్యదర్శి మెండే కుమార్ యాదవ్, వార్డ్ సభ్యులు బురుకుంట భాస్కర్, మమ్మిల్ల మల్లేష్, బీజేవైఎం నాయకులు బురుకుంట నాగేష్, సురేష్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: