పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో దెబ్బడగూడ గ్రామంతోపాటు తండాలో 72 లక్షలతో నిర్మించే  బిటి రోడ్డు, సిసి రోడ్డు పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.... పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెల నిధులు ఇస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.


గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు లాంటి కనీస సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నేడు మన పల్లెలు స్వచ్ఛ గ్రామాలుగా మారుతున్నాయన్నారు. ఈ కార్యాక్రమాలలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, ఎంపీపీ జ్యోతి, వైస్ ఎంపీపీ శామంత ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు జయేందర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: