కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా,,,

చేపట్టే ధర్నాలను విజయవంతం చేయండి

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో బీఆర్ఎస్ తరఫున చేపట్టే ధర్నాలను విజయవంతం చేయాలని రైతులను, ప్రజలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారని కానీ దేశంలో ఎరువుల ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు రెట్టింపు చేయడం ద్వారా వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు రెట్టింపు చేశారుని ఆమె విమర్శించారు. నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతుల ఆందోళనలకు కారణమయ్యారని 16 నెలలు రైతులు ఢిల్లీని చుట్టుముట్టి ఆందోళనలు చేసి 700 మంది రైతులు అమరులయ్యాక జాతికి క్షమాపణలు చెప్పి మోడీ చట్టాలు ఉపసంహరించుకున్నారని విమర్శించారు. చట్టాలు ఉపసంహరించుకున్నప్పుడురైతులకు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆమె పేర్కొన్నారు.


రైతులను మోసం చేయడం, మభ్యపెట్టడం తప్ప వారికి మేలు చేయాలన్న ఆలోచన ఏ కోశానా కనిపించడం లేదని, మొన్న నల్ల చట్టాలతో రైతుల ఉసురు పోసుకున్నారు...నిన్న తెలంగాణ రైతుల పంట కొనకుండా మాది కార్పొరేట్ ప్రభుత్వం అని చాటుకున్నారని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. నేడు పంట కల్లాలు వ్యవసాయం లో భాగం కాదనే భావనతో 151 కోట్ల విలువైన పనులు పూర్తి కాగా వాటిని తిరిగి చెల్లించాలంటూ కేంద్రం హుకుం జరిచేయటం శోచనీయమన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని తుంగలో తొక్కారు, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి ఉపాధి హామీ పనులను అనుసంధానం చేయాలని అనేక సార్లు కేంద్రాన్ని డిమాండ్ చేసారని ఆమె గుర్తుచేశారు.

పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తీర్మానాలు సైతం చేసి కేంద్రానికి పంపారని తెలియజేశారు. రూపాయలు 750 కోట్లతో 89 వేల రైతు కల్లాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని,  ఇతర రాష్టాల్లో చేపలు ఎండబెట్టుకునే కల్లాల నిర్మాణానికి అడ్డు రాని నిబంధనలు తెలంగాణ కు మాత్రం అడ్డొచ్చాయని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రైతు ముఖ్యమంత్రి గా కేసీఆర్ గొప్ప మనసుతో కేంద్రం కొనకున్న యాసంగి ధాన్యం కొనటానికి ముందుకు వచ్చారని, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ప్రజలంతా గమనిస్తున్నారు...తగిన సమయంలో బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. 
తెలంగాణ రాష్ట్రం రైతుల కోసం అమలుచేస్తున్న రైతు బంధు,భీమా,24 గంటల ఉచిత విద్యుత్, నాణ్యమైన విత్తనాలు, నకిలీ విత్తనాల పై పిడి యాక్ట్,రైతు వేదికలు,తదితర కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది.కేంద్రం మాత్రం వ్యవసాయం దండగ అనే రీతిలో కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తుంది. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు అన్ని జిల్లాల్లో జరిగే మహా ధర్నాలలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. రైతుల పట్ల కేంద్ర బిజెపి విధానాలను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. రైతులకు మేలు చేసే ప్రభుత్వం కేసీఆర్ ది- రైతు వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ ది.  రైతుల లాభం కోసమే 750 కోట్లతో రైతుకల్లాల నిర్మాణం కేసీఆర్ చేశారు. గత 9 ఏళ్లుగా రైతులకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోంది. రైతులు రోడ్డెక్కితేనే  మోడీ చెవులకు వినిపించేలా ఉంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన చేస్తే మోడీ దిగోవచ్చారు.నేడు తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకంగా కేంద్రం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి ని ఎండగడుతూ బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో జరిగే ధర్నాలలో రైతులు స్వచ్చందంగా తరలివచ్చి విజయవంతం చేయాలి

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దిగిపోయి 20 ఏళ్ళు అయిపోతోంది,కరోనా సమయంలో ఈ ప్రాంత ప్రజలను ఒక్కసారి కూడా పట్టించుకోలేదు.ఒక్క హైటెక్ సిటీ బిల్డింగ్ కడితే సైబరాబాద్ అభివృద్ధి జరిగినట్లా,తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టిన కార్యక్రమాలు నేడు కనిపిస్తున్నాయి. విలేకరుల సమావేశంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: