అర్హత లేని నకీలీ ఆర్.ఎం.పి క్లీనిక్ లు, మెడికల్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలి
ఆర్ వి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్ డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని హుశేనాపురంలో గ్రామంలో నిర్వహించిన సమావేశంలో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు,ప్రజా సంఘాల నాయకులు గ్రామాలలో ఆర్ఎంపీ వైద్యులు ప్రజలను నిట్టనిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.ఈ సందర్భంగా అల్ ఇండియా యూత్ లిగ్ జిల్లా అధ్యక్షుడు రాజు.రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్ )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్ర నాథ్ రాయలసీమ యూత్ యునీయన్ (అర్ వై యు) జిల్లా అధ్యక్షుడు విక్రమ్ లు మాట్లాడుతూ అనారోగ్యంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రైవేట్ అర్ ఎం పి.ల క్లినిక్ లకు వెళితే ప్రజలకు రక్త పరీక్ష ల్యాబ్ లలో టెస్టులు చేయించుకు రావాలని పొంతనలేని వైద్య పరీక్షలు రాసి ప్రజల వద్దనుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, ఓర్వకల్లు మండలంలోని మెడికల్ దుకాణాదారులు ఇష్టానుసారంగా టాబ్లెట్లు విక్రయిస్తున్నారని,మెడికల్ మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆర్ఎంపీ మరియు, మెడికల్ దుకాణ దారుల వద్ద నుండి ముడుపులు అందుకొని ఆర్ఎంపీలపై, మెడికల్ దుకాణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టానుసారంగా ఆర్థిక దోపిడీకి తెర లేపి ఆర్థిక దోపిడీకి పేద ప్రజలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల శ్రేయస్సు కోరి అనారోగ్యంతో వస్తున్న పేద,మధ్యతరగతి ప్రజలకు తక్కువ వ్యయంతో మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వ ఆసుపత్రిలులో ఎమ్ ఆర్ ఐ,స్కానింగ్ సెంటర్లను, రక్త పరీక్ష ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని,వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకాన్ని దుర్వినియోగం కాకుండా అమలు చేసి వివిధ పేర్లతో వసూలు చేస్తున్న ఆర్.ఎం.పి మరియు మెడికల్ దుకాణదారుల ఆర్ధిక దోపిడీ అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.మెడికల్ ఆర్థిక దోపిడికి వ్యతిరేఖంగా త్వరలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్ధి , యువజన , ప్రజాస్వామ్య సంఘాలు , ప్రజలు సమావేశంలో పాల్గొంటున్నట్లు ఆర్విఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాజు. విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
అర్హత లేని నకీలీ ఆర్.ఎం.పి క్లీనిక్ లు, మెడికల్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలి,,,,, ఆర్ వి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్ డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: