టూర్ లో మత్తుమందు ఇచ్చి విద్యార్థినీపై అత్యాచారం

యూపీలో మహిళలపై, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. టూర్ పేరుతో విద్యార్థినులను తీసుకెళ్లి ఓ విద్యార్థినికి మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రిన్సిపాల్. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మీరట్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ గత నెల 23న 9 మంది విద్యార్థినులను టూర్ పేరుతో బృందావన్‌కు తీసుకెళ్లాడు. అనంతరం రాత్రి బస కోసం ఓ హోటల్‌లో రెండు రూములు అద్దెకు తీసుకున్నాడు. 8 మందిని ఓ గదిలో ఉంచగా, 11వ తరగతి చదువుతున్న మరో విద్యార్థినిని తన గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. బాలిక మత్తులోకి జారుకున్న తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. 

బాలిక ప్రతిఘటించడంతో ప్రిన్సిపాల్ ఆమెను బెదిరించాడు. పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. టూర్‌ ముగిసిన అనంతరం 24న విద్యార్థినులను తీసుకుని ప్రిన్సిపాల్ వెనక్కి వచ్చాడు. ఆ తర్వాత బాధిత బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: