సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

రెండవ దశ మెట్రో పనుల శంకుస్థాపన సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గములోని పోలీస్ అకాడమీ వద్ద నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నాడు జిల్లెలగూడ లోని క్యాంపు కార్యాలయంలో  పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. మైండ్ స్పెస్ జంక్షన్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో పనులకు శంకుస్థాపన అనంతరం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పూర్తిగా రంగారెడ్డి జిల్లా పరిధిలో రెండవ దశ నిర్మిస్తుండటంతో జిల్లాకు మెట్రో మరో మణిహారం కానుందన్నారు. జిల్లా ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఇది పూర్తి అయితే ట్రాఫిక్ సమస్యలను అధిగమిస్తూ కాలుష్య రహిత ప్రయాణం కోసం మార్గం ఏర్పడుతుందన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: