నంద్యాల, కర్నూలు జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న...
అనుమతులు లేని అక్రమ లేఅవుట్లు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
ఉమ్మడి నంద్యాల,కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న (కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ ఏరియా) లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని ఏ ఐ ఎఫ్ బి, ఆర్ వి ఎఫ్, సి పి ఎం ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. వివరాలలోకి వెళితే... పాణ్యం మండలలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలపై అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నిర్మిస్తూ లేఅవుట్లు వేసుకొని ధనార్జనే ధ్యేయంగా ప్రజలను మోసం చేస్తూ సొమ్ము పోగు చేసుకుంటున్నారని రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బత్తిని ప్రతాప్, అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు వనం వెంకటాద్రి,శ్రీనివాస రావు,సిపిఎం మండల నాయకుడు భాస్కర్ ఆరోపించారు. ఈ అనుమతులు లేని లేఅవుట్ల పై వచ్చినటువంటి టాక్స్ అధికారులు గ్రామాలు అభివృద్ధి చేయకుండా ప్రజల పైన పన్నుల మీద పన్ను విధిస్తూన్నారని, గ్రామాల్లో రోడ్లు,లైట్లు, కాలువలు శుభ్రం చేయకుండా ఎక్కడున్న చెత్త,అక్కడే ఉంటుందని,చెత్త కుండీలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు రోగాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అక్రమ లేఅవుట్ల నిర్మాణాల అనుమతులను పది రోజులలో తెలపాలని, ప్రజలు తెలుసుకునే విధంగా బహిరంగ ప్రకటన చేయాలని,రెవెన్యూ శాఖ ఇచ్చిన ల్యాండ్ కన్వర్షన్ అనుమతుల వివరాలు ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారో తెలియజేయాలని లేకుంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలతో కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.అనంతరం స్పందన కార్యక్రమం లో పాణ్యం ఎమ్మార్వో మల్లికార్జున కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో విద్యార్ధి, ప్రజాసంఘాలు నాయకులు పాల్గొన్నారు.
Home
Unlabelled
నంద్యాల,కర్నూలు జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న... అనుమతులు లేని అక్రమ లేఅవుట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: