గ్రామ సచివాలయాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

ఆల్ ఇండియా స్టేట్ కౌన్సిల్ సభ్యులు వనం వెంకటాద్రి, ఆర్విఎఫ్ జిల్లా అధ్యక్షులు బత్తిన ప్రతాప్ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని స్థానిక పాణ్యం గ్రామంలో ని సచివాలయాల్లో రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారని ఆల్ ఇండియా స్టేట్ కౌన్సిల్ సభ్యులు వనం వెంకటాద్రి, ఆర్ వి ఎఫ్ జిల్లా అధ్యక్షులు బత్తిన ప్రతాప్ లు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాణ్యం గ్రామంలోని ఒకటి మరియు నాలుగు సచివాలయాల్లో రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయాల్లోకి ప్రవేశించి ప్రజలకు సంబంధించిన రేషన్ కార్డు మరియు పింఛన్లకు సంబంధించిన ఫైల్ లను ఎత్తుకెళ్లిపోవడం శోచనీయమని,ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే గ్రామ సచివాలయాలకే రక్షణ లేకపోతే ప్రజలకు ఏలాంటి రక్షణ కల్పిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, సచివాలయాకు వాచ్మెన్లను నియమించాలని, సచివాలయాలలో అక్రమంగా ప్రవేశించిన వారిని పోలీస్ శాఖ సిబ్బంది త్వరగా పట్టుకుని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: