కర్ణాటకలో తనపై నిషేధం విధించారన్న వార్తలపై 

కన్నడ చిత్ర పరిశ్రమ తనపై నిషేధం విధించినట్టు జరుగుతున్న ప్రచారంపై అందాల భామ రష్మిక మందన్న స్పందించారు. కన్నడ చిత్ర పరిశ్రమ తనపై ఎలాంటి నిషేధం విధించలేదని రష్మిక స్పష్టం చేశారు. 'కాంతార' విషయంలో తనపై కొందరు అత్యుత్సాహం చూపారని వెల్లడించారు. 

"కాంతార సినిమా చూసి చిత్రబృందానికి మెసేజ్ పెట్టాను. సినీ నటుల మధ్య ఏం జరుగుతుందనేది బయటి ప్రపంచానికి తెలియదు. అయినా నా వ్యక్తిగత జీవితం ప్రజలకు అవసరం లేదు. వృత్తిపరంగా ఏంచేస్తున్నానో చెప్పడం నా బాధ్యత. అంతవరకే. అంతేతప్ప నా పర్సనల్ విషయాలను కూడా కెమెరా పెట్టి అందరికీ చూపలేను. మెసేజ్ లు బయటికి విడుదల చేయలేను" అంటూ రష్మిక స్పష్టం చేశారు. రష్మిక ఖాతాలో పుష్ప-2 చిత్రంతో పాటు పలు బాలీవుడ్ చిత్రాలు కూడా ఉన్నాయి.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: