రూపాయి తీసుకున్నట్లు నిరూపించిన..
రాజకీయాల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతా
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సవాల్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
పిన్నపురం భూముల విషయంలో ఒక రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలనుండి తప్పుకుంటానని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సవాల్ విసిరారు. నంద్యాల లో కాటసాని రాంభూపాల్ రెడ్డి తన పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాపై ఇలాగే తప్పుడు ఆరోపణలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఒకవేళ మీరు ఏదైనా డబ్బులు ఇస్తానంటే దేవాలయాలకు, మసీద్ లకు, చర్చ్ లకు అభివృద్ధి పనుల కోసం ఇవ్వండని ఆయన సూచించారు. అంతేకానీ తనపై తప్పుడు ఆరోపణ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
Home
Unlabelled
రూపాయి తీసుకున్నట్లు నిరూపించిన.. రాజకీయాల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సవాల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: