వేములవాడ టౌన్ సెస్ ఎన్నికల ప్రచారంలో
దూకుడు పెంచిన బుక్క వేణుగోపాల్
బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలోకి దిగిన బుక్క
(జానో జాగో వెబ్ న్యూస్-వేములవాడ ప్రతినిధి)
నువ్వా...నేనా అన్నట్లుగా సాగుతున్న వేములవాడ టౌన్ సెస్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులకు మద్దతుగా తనదైన శైలీలో ప్రచారం నిర్వహిస్తున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్. వేములవాడలోనే మకాం వేసి వేములవాడ టౌన్ సెస్ ఎన్నికలో బిజెపి బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా 2వ రోజు కూడా బుక్క వేణుగోపాల్ ప్రచారం నిర్వహించారు. వేములవాడ టౌన్-1సెస్ డైరెక్టర్ గా బిజెపి బలపరిచిన అభ్యర్థి అల్లాడి నళిని-రమేష్ గెలుపునకై నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లష్మినారాయణ, ఎర్రం మహేష్, మీసాల చంద్రయ్యతో కలిసి గడపగడపకు బుక్క వేణుగోపాల్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటు కీలకంగా భావిస్తున్న ఆయన ఆ దిశగా ప్రచార వ్యూహాన్ని పదునుపెడుతున్నారు. ప్రతి ఓటరు కలసి బీజేపీ అభ్యర్థులకు మద్దతుకూడగట్టే పనిలో బుక్క తలమునకలయ్యారు.
Home
Unlabelled
వేములవాడ టౌన్ సెస్ ఎన్నికల ప్రచారంలో,,, దూకుడు పెంచిన బుక్క వేణుగోపాల్,,, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలోకి దిగిన బుక్క
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: