అన్న క్యాంటీన్లు ఎత్తివేయడం సబబు కాదు... 

గడిగేరేవుల గ్రామ ప్రజలు

 ఇదేం కర్మ కార్యక్రమంలో పాల్గొన్న గౌరు చరిత రెడ్డి


(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడిగరేవుల గ్రామంలో పాణ్యం మాజీ సభ శాసనసభ్యురాలు గౌరు చరిత రెడ్డి రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. వివరాల్లోకి వెళితే గడివేముల మండల పరది లోని గడిగరేవుల గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి "ఇదేం కర్మ" కార్యక్రమంలో భాగంగా గడిగరేవుల గ్రామంలోని ప్రజలను కలుసుకొని సమస్యలను తెలుసుకొని గ్రామంలో సమస్యల పరిష్కార మార్గంగా అడుగులు వేయాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గ్రామంలోని ప్రజలకు కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ


గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని రాష్ట్ర  ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి, నివారణ చర్యలు చేపట్టడం లేదని, నిత్యవసర సరుకులు అధిక ధరలుతో ఆకాశాన్ని అందుకున్నాయని,రైతుల శ్రేయస్సు ముఖ్యమని చెబుతున్న ప్రభుత్వం ఆర్ బి కే సెంటర్ ల ద్వారా నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేసి, రైతన్నలను అప్పుల పాలు చేసి రైతుల నడ్డి విరుస్తుందని,ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అన్నా క్యాంటీన్లను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే వాటన్నింటినీ తొలగించారని,

గ్రామాల్లో ఉన్న సమస్యను అధికారంలో లేకున్నా ప్రజల వద్దకు,రైతుల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారమార్గంగా అడుగులు వేసి ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గడిగరేవుల గ్రామ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో గడివేముల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి, నంద్యాల జిల్లా మహిళా కోఆర్డినేటర్ సుభద్రమ్మ, ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫరూక్, మంచాలకట్ట శ్రీనివాస్ రెడ్డి, గడిగరేవుల రాచమల్లు శ్రీనివాసులు,

నాగరాజు, శ్రీనివాసులు,వడ్డె జమ్ములయ్య, కొరటమద్ది ఆచారి,గడివేముల మండల సర్పంచులు చిందుకూరు అనసూయమ్మ,పెసర వాయి వోడ్డు లక్ష్మీదేవి, ఓందుట్ల గంగాధర్ రెడ్డి, కరిమద్దిల ఈశ్వర్ రెడ్డి, శివారెడ్డి ,దుర్వేసి కృష్ణ యాదవ్, బుజనూరు రామచంద్రారెడ్డి,బిలకల గూడూరు రఫిక్,సుదర్శన్ రెడ్డి,ఎల్కే తండా రంగస్వామి నాయక్, గడివేముల టిడిపి సీనియర్ నాయకులు సీతారామిరెడ్డి, అవ్వారు శ్రీకాంత్,శ్రీనివాస్ రెడ్డి, రమణారెడ్డి, గఫూర్, సుబ్బారెడ్డి టిడిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: