ఆమె గురించి అత్యధికంగా వెతికేశారు అంటా

గూగుల్ లో ఎక్కువగా మన నేటిజన్లు  ఎక్కువగా ఎవరిని వెతికారో తెలుసా....? ఇదిలావుంటే మరి కొన్నిరోజుల్లో కొత్త సంవత్సరం వస్తోంది. 2022 సంవత్సరానికి ముగింపు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో, గూగుల్ 2022 సెర్చ్ రిజల్ట్స్ వివరాలు వెల్లడించింది. దక్షిణాది సినీ భామల్లో అత్యధికంగా వీరి గురించే వెదికారంటూ ఓ జాబితా విడుదల చేసింది. ఇందులో కాజల్ అగర్వాల్ అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల తల్లయిన కాజల్ గురించి నెట్టింట అత్యధికులు శోధించారని గూగుల్ తెలిపింది. 2020లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన కాజల్ ఈ ఏడాది ఏప్రిల్ లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ జాబితాలో సొట్టబుగ్గల సమంత రెండో స్థానంలో ఉంది. ఇటీవల సమంత ఆరోగ్య పరిస్థితులపై తీవ్రస్థాయిలో కథనాలు వచ్చాయి. దాంతో అభిమానులు సమంత అనారోగ్యం గురించి భారీ స్థాయిలో సెర్చ్ చేశారని గూగుల్ వెల్లడించింది. 

పుష్ప భామ రష్మిక మందన్న ప్రత్యేకమైన కారణాలేవీ లేకపోయినా ఈ చార్ట్ లో మూడో స్థానం దక్కించుకుంది. ఆమె పోస్టు చేసే సంచలన ఫొటోలు, అభిమానులతో నిత్యం టచ్ లో ఉండడం వంటి కారణాలు ఆమెకు సెర్చ్ రిజల్ట్స్ లో మెరుగైన స్థానాన్ని అందించాయి. మిల్కీ బ్యూటీ తమన్నాది కూడా సేమ్ టు సేమ్. తమన్నా ఎప్పటికప్పుడు ట్రెండీగా ఉండే ఫొటోలతో రెగ్యులర్ గా పలకరిస్తుంటుంది. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ జాబితాలో తమన్నా నాలుగో స్థానంలో ఉంది. 

దక్షిణాదిన అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఈ లిస్టులో 5వ స్థానంలో ఉంది. నయనతార ఇటీవల సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనివ్వడంతో, ఆమెకు సంబంధించిన వివరాల కోసం నెటిజన్లు గూగుల్ పై పడ్డారు. ఇక, అందాల అనుష్క శెట్టిది మరో కథ. ఆమె నుంచి చాలాకాలంగా కొత్త చిత్రాలు ఏవీ రాకపోయినా ప్రేక్షకుల్లో ఆమె ముద్ర చెరగనిదని స్పష్టమైంది. సెర్చ్ రిజల్ట్స్ జాబితాలో అనుష్క 6వ స్థానంలో ఉంది.

ఇటీవల నార్త్ లోనూ సినిమాలు చేస్తూ జోరుమీదున్న కన్నడ బ్యూటీ పూజా హెగ్డేకు సౌత్ లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ట్రెండింగ్ లో పూజా ఏడోస్థానం దక్కించుకుంది. జాతీయ అవార్డు విజేత కీర్తి సురేశ్ దక్షిణాది భామల జాబితాలో 8వ స్థానంలో నిలవడమే కాదు, టాప్-100 పాప్యులర్ ఏషియన్ స్టార్స్ జాబితాలోనూ స్థానం సంపాదించుకుంది. నటనే పెట్టుబడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న తమిళమ్మాయి సాయి పల్లవికి 9వ స్థానం, స్లిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కు 10వ స్థానం లభించాయి.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: