గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికా శిక్షణా తరగతులు

గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గ్రామ పంచాయతీల యందు 2023-24 సం గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళిక తయారు చేయడానికి శిక్షణ నిమిత్తం నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్  ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామపంచాయతీలలో గ్రామాలను అభివృద్ధి చేయడానికి శిక్షణా తరగతులను 13.12.2022 ఉదయం 9 గంటలకు బిలకలగూడూరు,చిందుకూరు,బూజునూరు, దుర్వేసి గ్రామ పంచాయతీలకు మరియు మధ్యాహ్నం గడివేముల,గడిగరేవుల, తిరుపాడు,గని గ్రామపంచాయతీలకు శిక్షణ తరగతులు ఉంటాయని,14.12.2022 వ తేదీన ఉదయం కరిమద్దేల,కోరటమద్ది కొర్రపోలురు,కే బొల్లవరం. మధ్యాహ్నం మంచాలకట్ట, ఓందుట్ల, ఎల్కే తాండా, పెసర వాయి గ్రామపంచాయతీలకు మండల స్థాయి లో శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణా తరగతులకు మండల పరిధిలోని ZPTC సభ్యులు,సర్పంచులు, ఎంపీటీసీసభ్యులు, మండల గ్రామ స్థాయి అధికారులు అందరూ తప్పక హాజరు కావాలని గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: