మిషన్ కాకతీయతో.. గ్రామాలకు జలకళ

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కురుమలగూడ 10 వ డివిజన్ పరిధిలో 2 కోట్ల నలభై లక్షలు రూపాయలతో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ దావూద్ ఖాన గూడ లో  3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులకు కూడా ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత తీయటం ద్వారా జల కళ సంతరించుకున్నాయి. గ్రామాల్లో చెరువులు నిండితే  రైతులకు మేలు జరుగుతుండగా, పట్టణాల్లో చెరువులు నిండి కాలనీల్లో నీరు చేరుతుందనీ మంత్రి సబితా రెడ్డి తెలిపారు. కట్ట మరమ్మతులు చేపట్టి నియోజకవర్గములో చెరువులను సుందరికరిస్తున్నామని, అందులో భాగంగా ఇప్పటికే సంద చెరువు ప్రజలకు అందుబాటులో రాగా,మంత్రాల చెరువు,పెద్ద చెరువు, బడంగ్ పేట్ లో పోచమ్మ కుంట,కుమ్మరి కుంట,కుర్మల్ గూడ లలో కూడా చెరువుల సుందరికరణ పనులు పడుతున్నామని ఆమె వెల్లడించారు.


ఆర్ సి ఐ నుండి తుర్కయంజాల్ వరకు140 కోట్లతో 100 ఫీట్ల రోడ్డు పనులకు సంభందించి టెండర్ ప్రక్రియ పూర్తి కావొస్తుందనీ, సిఎస్ఆర్ కింద  మేఘా సంస్థ నియోజకవర్గములో 12 కోట్లతో పాఠశాల నిర్మాణాలకు ముందుకురావటం ఎంతో అభినందనీయమన్నారు. మీర్ పేట్ లెనిన్ నగర్ తో పాటుగా బడంగ్ పేట్ లో మూడు నుండి నాలుగు కోట్ల రూపాయలతో పాఠశాల భవన నిర్మాణం చేపడుతున్నామని ఆమె వెల్లడించారు. బడంగ్ పేట్ పాఠశాల రోడ్డు విస్తరణ తర్వాత ఆటస్థలం లేకుండా పోతుంది. దాంతో క్రీడా మైదానం పక్కన విశాలమైన స్థలంలో నూతన భవనం నిర్మించటానికి శంకుస్థాపన చేయటం జరుగుతుంది.గ్రంథాలయాము కూడా పక్కనే ఉంది.పెయింటింగ్ ఫర్నిచర్ కూడా పూర్తి  చేసి మార్చి నెల వరకు అందుబాటులో తేవాలి అని ఆమె పేర్కొన్నారు.

మన ఊరు మన బడి లో కార్యక్రమంలో భాగంగా పాఠశాలల రూపురేఖలు మార్చే గొప్ప కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టడం ఎంతో గొప్ప విషయం అన్నారు. పెద్ద ఎత్తున సి ఎస్ ఆర్ నిధులు నియోజకవర్గానికి వచ్చేలా కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కి ,మంత్రి కే టి ఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె పేర్కొన్నారు.


బాలాపూర్ లో కూడా 3 కోట్లతో పాఠశాల నిర్మాణ  పనులు జరుగుతున్నాయి.. త్వరగా పూర్తి అయ్యేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. బాలాపూర్, నాదర్గుల్ పాఠశాలలు మన ఊరు మన బడి కింద అభివృద్ధి పనులు జరుగుతున్నాయి...నియోజకవర్గములో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామని ఆమె వెల్లడించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: