విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి

ఉపాధ్యాయులకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ రవీందర్ పిలుపు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ పిలుపునిచ్చారు. పాతబస్తీలోని దూద్ బౌలి ప్రాంతం నందు గల బాపూ సేవా శ్రయం 75వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. పాతబస్తిలోని విద్యార్థులకు బాపూ సేవాశ్రయం ద్వారా విద్యను అందిస్తున్నందుకు అభినందిస్తున్ననని ఆయన పేర్కొన్నారు. ఎంతోమంది మేధావులు గొప్ప వ్యక్తులను అందించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉందని ఆయన తెలిపారు.


ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 750 డిగ్రీ కాలేజీలలో దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని ఆయన తెలిపారు. గత ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ 105వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని ఆయన తెలిపారు. వందేమాతరం ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రారంభమైందని ఆయన చెప్పారు. అనేక ఉద్యమాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా మారిందన్నారు. అనంతరం విద్యలో ప్రతిభా కనబరిచిన కస్తూర్బా బాలిక పాఠశాల విద్యార్థులకు, బాపు పబ్లిక్ హై స్కూల్ విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రధానం చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ బీసీ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ ను బాపు సేవాశ్రయం అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్ శాలువా కప్పి సన్మానించారు. బాపు సేవాశ్రయం అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యను అందించడంతోపాటు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు నోట్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. బాపు సేవాశ్రయం లాంటి వాటికి ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిఎన్ఏ ప్రతినిధులు కే బాలకృష్ణ, జి రామారావు, కే నాగేశ్వరరావు, విజయ్ పాల్ పాండియతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: